మాస్కులు ధరించాలని బీఎంసీ ముమ్మర ప్రచారం

ABN , First Publish Date - 2020-10-13T15:59:13+05:30 IST

కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు, ముంబై పోలీసులు నెలరోజుల పాటు ముమ్మర ప్రచారం చేయాలని నిర్ణయించారు....

మాస్కులు ధరించాలని బీఎంసీ ముమ్మర ప్రచారం

ముంబై : కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు, ముంబై పోలీసులు నెలరోజుల పాటు ముమ్మర ప్రచారం చేయాలని నిర్ణయించారు. కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించి మాస్కు ధరించని వారిపై కేసులు నమోదు చేసి వారికి జరిమానా విధిస్తామని బీఎంసీ అధికారులు హెచ్చరించారు.960 మంది ఉద్యోగులను నియమించి మాస్కు ధరించని వారికి జరిమానాలు విధిస్తున్నారు. మాస్కులు ధరించిన వారు రోజుకు 20వేల మందికి జరిమానాలు విధిస్తున్నారు.


ఫేస్ మాస్కు ధరించకుంటే వారి నుంచి 200రూపాయల జరిమానాను వసూలు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే మాస్కులు ధరించని వారి నుంచి రూ.60 లక్షల జరిమానాను బీఎంసీ అధికారులు వసూలు చేశారు. బహిరంగ ప్రదేశంలో ఉమ్మి వేసిన 852 మంది పౌరుల నుంచి రూ.1.46 లక్షల జరిమానాను వసూలు చేశారు. 


ముంబై నగరంలో పౌరులు  మాస్కులు ధరించడం లేదని, ఈ పరిస్థితి భవిష్యత్ లో కరోనా తీవ్రతరం అయ్యేందుకు కారణమవుతుందని బీఎంసీ చీఫ్ ఇక్బాల్ సింగ్ చాహల్ ఆందోళన వ్యక్తం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించని వారికి జరిమానాలు విధించేలా ప్రత్యేక డ్రైవ్ చేపట్టామని ఇక్బాల్ చెప్పారు. 

Updated Date - 2020-10-13T15:59:13+05:30 IST