వినీలాకాశంలో 'బ్లూ మూన్' కనువిందు

ABN , First Publish Date - 2020-11-01T01:44:37+05:30 IST

వినీలాకాశంలో 'బ్లూ మూన్' చూడడానికి రెండు కళ్లూ చాలవు. ఈనెల 31వ తేదీ ..

వినీలాకాశంలో 'బ్లూ మూన్' కనువిందు

న్యూఢిల్లీ: వినీలాకాశంలో 'బ్లూ మూన్' చూడడానికి రెండు కళ్లూ చాలవు. ఈనెల 31వ తేదీ రాత్రి మరోసారి జాబిల్లి కనువిందు చేయబోతోంది. ఒకేనెలలో రెండు సార్లు పౌర్ణమి వస్తే దానిని 'బ్లూ మూన్'‌గా వ్యవహరిస్తుంటాం. సహజంగా ప్రతి నెలలో ఒక అమావాస్య, ఒక పౌర్ణమి వస్తుంటాయి. అసాధారణ సందర్భాల్లో ఒకే నెలలో రెండు పౌర్ణమిలు వస్తుంటాయి. అక్టోబర్‌లో అలాంటి అసాధారణ సందర్భం చోటుచేసుకుంటోంది. ఈనెలలో తొలి పౌర్ణమి 1-2 తేదీల్లో వచ్చింది. రెండో పౌర్ణమి ఈనెల 31న ఉంటుంది.


బ్లూ మూన్ అనేది క్యాలెండ్రికల్ టెర్మ్‌గా చెప్పుకోవాలి. ఒకే నెలలో రెండు పౌర్ణమిలు వస్తే రెండో పౌర్ణమిని 'బ్లూ మూన్' అంటాం. దీనిని 'హంటర్ మూన్' అని కూడా వ్యవహరిస్తారు. వేటగాళ్లకు చలికాలంలో జంతువులను వేటాండేందుకు ఇది సహకరిస్తుంటుంది. అందుకే దీన్ని 'హంటర్ మూన్' అంటారు.


బ్లూ మూన్ ఎప్పుడొస్తుంది?

చంద్రుడి నెల వ్యవధి 29.531 రోజులు. అంటే 29 రోజుల 12 గంటల 44 నిమిషాల 38సెకన్లు. ఒకే నెలలో రెండు పౌర్ణమిలు ఉండాలంటే నెల 1- 2తేదీల్లో తొలి పౌర్ణమి రావాలి. దాదాపు 30 నెలల తర్వాత సంవత్సరంలో ఒక అదనపు పౌర్ణమి ఉంటుంది. శాస్త్రవేత్తలు చెప్పే దాని ప్రకారం ఫిబ్రవరిలో 28 రోజులే ఉండటంతో ఆ నెలలో ఫుల్ మూన్ సాధ్యం కాదు. 2018లో రెండు బ్లూ మూన్స్ కనిపించాయి. మొదటిది జనవరి 31న రెండోది మార్చి 31న కనిపించింది.


ఇండియాలో ఎప్పుడు కనిపిస్తుంది?

అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే బ్లూ మూన్ ఈసారి అక్టోబర్ 31వ తేదీ రాత్రి 8.19 గంటలకు భారత్‌లో కనిపిస్తుంది. నార్త్ అమెరికా, సౌత్ అమెరికాతో పాటు, ఆఫ్రికా, యూరప్, దాదాపు ఆసియా అంతటా వినీలాకాశంలో నిండు చంద్రుడు కనిపించి, కనువిందు చేయనున్నాడు.


Updated Date - 2020-11-01T01:44:37+05:30 IST