భారీ పేలుడు... కూలిన గాంధీమఠ్ క్లబ్ పైకప్పు

ABN , First Publish Date - 2020-10-13T17:19:44+05:30 IST

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఈ రోజు ఉదయం ఒక పురాతన భవనంలో పేలుడు సంభవించింది. ఈ ఘటన బెల్‌ఘాట్ గాంధీమఠ్ ఫ్రెండ్స్ సర్కిల్ క్లబ్ భవనంలో...

భారీ పేలుడు... కూలిన గాంధీమఠ్ క్లబ్ పైకప్పు

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఈ రోజు ఉదయం ఒక పురాతన భవనంలో పేలుడు సంభవించింది. ఈ ఘటన బెల్‌ఘాట్ గాంధీమఠ్ ఫ్రెండ్స్ సర్కిల్ క్లబ్ భవనంలో చోటుచేసుకుంది. ప్రాధమిక సమాచారం ప్రకారం ఈ పేలుడులో ఒక గోడలోని కొంత భాగం విరిగిపడింది. కాగా ఈ పేలుడుకు గల కారణం ఇంతవరకూ తెలియలేదు. అలాగే ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడినట్లు ఇంతవరకూ సమాచారం లేదు. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. 


Updated Date - 2020-10-13T17:19:44+05:30 IST