అయోధ్య రామునికి వెచ్చదనం కోసం దుప్పటి, హీటర్

ABN , First Publish Date - 2020-12-15T23:28:22+05:30 IST

శ్రీరాముడు, ఆయన సోదరులు చలి బాధలు అనుభవించకుండా

అయోధ్య రామునికి వెచ్చదనం కోసం దుప్పటి, హీటర్

అయోధ్య : శ్రీరాముడు, ఆయన సోదరులు చలి బాధలు అనుభవించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. హీటర్, వెచ్చని దుప్పట్లతో రక్షణ కల్పిస్తున్నారు. ఉత్తర ప్రదేశ్‌లో ఉష్ణోగ్రతలు తగ్గిపోయి, చలి తీవ్రంగా ఉండటంతో ఈ విగ్రహాలకు వెచ్చదనం కల్పించడం కోసం ఏర్పాట్లు చేశారు. 


రామ్ లల్లా దేవాలయం ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ మాట్లాడుతూ, తాత్కాలిక దేవాలయంలో బ్లోయర్ హీటర్‌ను ఏర్పాటు చేశామన్నారు. తీవ్రమైన చలి కారణంగా శ్రీరాముడు, ఆయన సోదరులు ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. ఈ విగ్రహాలను వెచ్చని దుస్తులు, దుప్పట్లతో కప్పుతున్నట్లు తెలిపారు. ఈ దేవాలయంలో వెచ్చదనం కోసం ఓ కొలిమిని ఏర్పాటు చేయాలని గతంలో అనుకున్నామని, అయితే ఈ దేవాలయాన్ని కర్ర, గాజుతో నిర్మించినందువల్ల ఆ ప్రయత్నాన్ని మానుకున్నామని తెలిపారు. చలి కాలం ఉన్నంత వరకు ఈ ఏర్పాట్లు కొనసాగుతాయని చెప్పారు. 


శ్రీరాముడు ఈ దేవాలయంలో ఓ బాలుని రూపంలో ఉన్నందువల్ల తీవ్రమైన శీతల వాతావరణం నుంచి ఆయనను కాపాడటానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపారు. 


Updated Date - 2020-12-15T23:28:22+05:30 IST