మాపై నిందలైస్తే మీ ప్రతిష్ఠకే నష్టం: చైనా విదేశాంగ మంత్రి
ABN , First Publish Date - 2020-05-25T00:17:10+05:30 IST
తమపై నిందలు వేయడం ద్వారా పలు దేశాలు తమ ప్రతిష్ఠను దిగజార్చుకుంటున్నాయని...

బీజింగ్: తమపై నిందలు వేయడం ద్వారా పలు దేశాలు తమ ప్రతిష్ఠను దిగజార్చుకుంటున్నాయని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఈ పేర్కొన్నారు. ‘ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఇలాంటి తరుణంలో కష్టాల్లో ఉన్న దేశాలకు సాయం చేయాల్సింది పోయి అహంకారం ప్రదర్శించడం, తమ తప్పులను ఇతర దేశాలపైకి నెట్టేయడం సమంజసం కాద’ని వాంగ్ హితవు పలికారు. అంతేకాకుండా కరోనాకు సంబంధించి చైనాపై అంతర్జాతీయంగా ఎవరైనా కేసులు పెట్టినా అవి సాగే అవకాశం లేదని వాంగ్ తెలిపారు.