సెక్స్‌ రాకెట్‌లో బీజేపీ నాయకురాలు!

ABN , First Publish Date - 2020-10-04T08:10:06+05:30 IST

రాజస్థాన్‌లోని సవాయి మాధోపూర్‌లో భారీ సెక్స్‌ రాకెట్‌ బయటపడింది. ఈ రాకెట్‌ను బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు సునీతా వర్మ నిర్వహించడం విశేషం...

సెక్స్‌ రాకెట్‌లో బీజేపీ నాయకురాలు!

జైపూర్: రాజస్థాన్‌లోని సవాయి మాధోపూర్‌లో భారీ సెక్స్‌ రాకెట్‌ బయటపడింది. ఈ రాకెట్‌ను బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు సునీతా వర్మ నిర్వహించడం విశేషం. 17 ఏళ్ల యువతి ఫిర్యాదుతో ఈ రాకెట్‌ బయటపడింది. సునీతాను పోలీసులు గత నెల 26న అరెస్టు చేయడంతో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఆమెను పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. ఈ రాకెట్‌లో భాగస్వాములైన ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగినులు, మరో మహిళను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుతో సంబంధం ఉన్న కాంగ్రెస్‌ సేవాదళ్‌ నాయకురాలు పూనం చౌదరి, మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. 

Updated Date - 2020-10-04T08:10:06+05:30 IST