పంజాబ్ ఎన్నికల్లో 117 స్థానాల్లో బీజేపీ పోటీ

ABN , First Publish Date - 2020-10-03T18:45:08+05:30 IST

పంజాబ్ రాష్ట్రంలో 2022లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 117 స్థానాల్లోనూ పోటీ చేస్తుందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ ప్రకటించారు....

పంజాబ్ ఎన్నికల్లో 117 స్థానాల్లో బీజేపీ పోటీ

జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ వెల్లడి

చండీఘడ్ (పంజాబ్): పంజాబ్ రాష్ట్రంలో 2022లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 117 స్థానాల్లోనూ పోటీ చేస్తుందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ ప్రకటించారు. వ్యవసాయ బిల్లుపై అకాలీదళ్ బీజేపీతో సంబంధాలు తెంచుకున్న 6 రోజుల తర్వాత బీజేపీ కొత్తగా నియమించిన జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుంగ్ విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ రాష్ట్రానికి బీజేపీ నేత ముఖ్యమంత్రి అవుతారని ఆయన చెప్పారు. రైతులు, సిక్కులు, పంజాబీలకు, పంజాబ్ భాషకు అన్యాయం జరిగిందని పేర్కొంటూ శిరోమణి అకాలీదళ్ గత శనివారం బీజేపీతో 24 సంవత్సరాల పొత్తును విరమించుకుంది. 


వ్యవసాయ బిల్లుతో రైతుల జీవితాలను మెరుగుపరుస్తామని చుగ్ చెప్పారు. కాగా కొత్త వ్యవసాయ బిల్లుకు సంబంధించిన రైతుల సమస్యలను ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ అధ్యక్షుడు జేపీనడ్డాలతో రైతుసంఘాలను కలిపేలా సమావేశం ఏర్పాటు చేస్తానని బీజేపీ ఎంపీ హన్సరాజు చెప్పారు. 

Updated Date - 2020-10-03T18:45:08+05:30 IST