ఎల్జేపీలో చేరిన బీజేపీ సీనియర్ నేత ఉషా విద్యార్థి

ABN , First Publish Date - 2020-10-07T20:04:01+05:30 IST

ఎన్నికలు దగ్గరపడ్డాయ్. సీట్ల వ్యవహారమూ కుదిరిపోయింది. సరిగ్గా ఈ సమయంలో బీజేపీకి చెందిన

ఎల్జేపీలో చేరిన బీజేపీ సీనియర్ నేత ఉషా విద్యార్థి

పాట్నా : ఎన్నికలు దగ్గరపడ్డాయ్. సీట్ల వ్యవహారమూ కుదిరిపోయింది. సరిగ్గా ఈ సమయంలో బీజేపీకి చెందిన సీనియర్ నేత ఉషా విద్యార్థి బుధవారం పార్టీకి రాజీనామా చేశారు. లోక్‌జనశక్తి పార్టీలో చేరిపోయారు. ‘‘బిహార్‌ను అభివృద్ధి పథంలో నడిపించడానికి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నాను. అందుకు ప్రేరణ ‘‘బిహార్ ఫస్ట్. బిహారీ ఫస్ట్’’ అన్న నినాదమే.’’ అని ఉషా ప్రకటించారు. అయితే ఉషా విద్యార్థిని పార్టీలో తీసుకురావడానికి స్వయంగా చిరాగ్ పాశ్వానే పావులు కదిపారు. చివరికి విజయం సాధించారు. అయితే చిరాగ్ పాశ్వాన్ వేసిన ఈ ఎత్తుగడ జేడీయూలో కాస్తంత అలజడికి కారణమైందని సమాచారం. వాస్తవానికి ఉషాను జేడీయూలోకి చేర్చుకోవాలని ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. 


Read more