కారు కాదు..విమానం ఇచ్చినా బీజేపీ గెలవదు!

ABN , First Publish Date - 2020-08-20T14:14:30+05:30 IST

కారు కాదు..విమానం ఇచ్చినా బీజేపీ గెలవదు!

కారు కాదు..విమానం ఇచ్చినా బీజేపీ గెలవదు!

చెన్నై, (ఆంధ్రజ్యోతి) : బీజేపీ జిల్లా కార్యదర్శులకు ఇన్నోవా కార్లు కాదు ఏకంగా విమానాలను బహుమానంగా ఇస్తామని ప్రకటించినా రాష్ట్రంలో ఆ పార్టీ గెలిచే అవకాశాలే లేవని డీఎంకే నేత నాంజిల్‌ సంపత్‌ ఎద్దేవా చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గెలిస్తే ఆయా జిల్లాల శాఖ నేతలకు ఇన్నోవా కార్లను బహుమానంగా ఇస్తామని ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మురుగన్‌ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నాగర్‌కోవిల్‌లో బుధవారం నాంజిల్‌ సంపత్‌ మీడియాతో మాట్లా డుతూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమి అత్యధిక మెజారిటీతో గెలుస్తుందని తెలిపారు. ప్రస్తుతం బీజేపీ సహా ఇతర పార్టీలకు చెందిన నాయ ుకులంతా డీఎంకేలో చేరుతున్నారని, ఇదే పరిస్థితి కొనసాగితే బీజేపీకి నేతలు కూడా కరవై పోతారని పేర్కొన్నారు. ఇక రాష్ట్ర ప్రజలంతా వైరస్‌ వ్యాప్తికి భయపడుతుంటే మంత్రులు వైరస్‌ నిరోధక పనులకు వెళ్ళకుండా రెండో రాజధాని ఏర్పాటు చేయాలంటూ వేర్వేరు ప్రకటనలు చేయటం గర్హనీయమన్నారు. ముఖ్యమంత్రి ఎడప్పాడి కి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వంకు ప్రజల మద్దతు లేదని, వచ్చే యేడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరూ ఓడిపోవటం ఖాయమన్నారు. జైలులో ఉన్న శశికళ విడుదలవుతుందని ఊహా గానాలు వస్తుంటేనే అన్నాడీఎంకే నేతల గుండెల్లో గుబులు పుడుతోందన్నారు. మక్కల్‌ నీది మయ్యం అధ్యక్షుడు కమల్‌హాసన్‌ అధికారంలో వస్తామంటూ పగటి కలలు కంటున్నారని, కనీసం ఓటు బ్యాంక్‌ కూడా పెంచుకోలేని పార్టీని ఆయన నడుపుతున్నారని సంపత్‌ విమర్శించారు.

Updated Date - 2020-08-20T14:14:30+05:30 IST