బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకి కరోనా పాజిటివ్
ABN , First Publish Date - 2020-12-14T00:42:40+05:30 IST
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ‘‘కరోనా ప్రాథమిక లక్షణాలు అని అనుమానం రావడంతో

న్యూఢిల్లీ : బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ‘‘కరోనా ప్రాథమిక లక్షణాలు అని అనుమానం రావడంతో కరోనా పరీక్షలు నిర్వహించుకున్నా. నివేదికలో కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతానికి నా ఆరోగ్యం బాగానే ఉంది. వైద్యుల సలహాలు, కరోనా మార్గదర్శకాలను పూర్తిగా పాటిస్తున్నాను. నాతో పాటు కాంటాక్ట్‌లోకి వచ్చిన వారందరూ దయచేసి కరోనా పరీక్షలు చేయించుకోండి’’ అని జేపీ నడ్డా ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశారు.