నెాలపాటు ఆందోళన కార్యక్రమాలను నిలిపేసిన బీజేపీ

ABN , First Publish Date - 2020-03-18T21:38:28+05:30 IST

కరోనా వైరస్ కారణంగా దేశంలో ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేపట్టకూడదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

నెాలపాటు ఆందోళన కార్యక్రమాలను నిలిపేసిన బీజేపీ

న్యూఢిల్లీ :  కరోనా వైరస్ కారణంగా దేశంలో ఓ నెల పాటు ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేపట్టకూడదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బుధవారం సూచించారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌పై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ప్రధాని మోదీ బీజేపీ ఎంపీలకు సూచించిన తర్వాత నడ్డా ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ఏప్రిల్ 15 వరకు ఎలాంటి ఆందోళన కార్యక్రమాలు చేపట్టవద్దని కూడా ప్రధాని వారికి సూచించారు. ప్రధాని సూచించిన సూచనను దృష్టిలో పెట్టుకుని ఓ నెల పాటు ఆందోళన కార్యక్రమాలకు దూరంగా ఉండాలని తాము నిర్ణయం తీసుకున్నామని నడ్డా వివరించారు. ఇప్పటికే అన్ని రాష్ట్ర శాఖలకు ఈ ఆదేశాలను జారీ చేసినట్లు ఆయన తెలిపారు. అలాగే కరోనాపై అన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర శాఖలకు అధిష్ఠానం ఆదేశాలు జారీ చేసింది. 

Updated Date - 2020-03-18T21:38:28+05:30 IST