ఛాముండేశ్వరి ఆలయానికి బీజేపీ ఎమ్మెల్యే, స్థానికుల విమర్శలు

ABN , First Publish Date - 2020-07-19T22:19:17+05:30 IST

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా కర్ణాటకలోని మైసూరు సమీపంలో ఉన్న ఛాముండేశ్వరి ఆలయంలోకి కొద్ది రోజుల పాటు ప్రవేశం నిషేదించారు. స్థానికులు ఎవరినీ ఆ ఆలయంలోకి అనుమతించడం లేదు. ఇదే తరుణంలో శుక్రవారం ఉదయం

ఛాముండేశ్వరి ఆలయానికి బీజేపీ ఎమ్మెల్యే, స్థానికుల విమర్శలు

మైసూరు: తాజాగా ఛాముండేశ్వరి ఆలయాన్ని సందర్శించిన భారతీయ జనతా పార్టీకి చెందిన ఓ ఎంపీ తీవ్ర విమర్శల పాలవుతున్నారు. వీవీఐపీ రేసిజం అంటూ అక్కడి స్థానికులే ఆమెపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. లాక్‌డౌన్ కారణంగా ఆలయ ప్రవేశం రద్దు చేసినప్పటికీ ఆమె అమ్మవారిని దర్శించడం ఈ విమర్శలకు కారణం.


కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా కర్ణాటకలోని మైసూరు సమీపంలో ఉన్న ఛాముండేశ్వరి ఆలయంలోకి కొద్ది రోజుల పాటు ప్రవేశం నిషేదించారు. స్థానికులు ఎవరినీ ఆ ఆలయంలోకి అనుమతించడం లేదు. ఇదే తరుణంలో శుక్రవారం ఉదయం ఛాముండేశ్వరి ఆలయానికి బీజేపీకి చెందిన ఎంపీ శోభా కరంద్లాజే వచ్చారు. పోలీసు భద్రత మధ్య ఆమె అమ్మవారిని దర్శించుకున్నారు.


అయితే, ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా ఆలయ ప్రవేశం చేసినందుకు ఎంపీపై స్థానికులు విమర్శలు గుప్పిస్తున్నారు. అంతే కాకుండా తమను గుడిలోకి వెళ్లడానికి నిరాకరించే పోలీసులే ఎంపీని దగ్గరుండి దర్శనం చేయించడమేంటని ప్రశ్నిస్తున్నారు.

Updated Date - 2020-07-19T22:19:17+05:30 IST