కోర్టునే బురిడీ కొట్టించాలని చూసిన బీజేపీ ఎమ్మెల్యే..!

ABN , First Publish Date - 2020-12-27T23:09:41+05:30 IST

కోర్టు విచారణకు హాజరయ్యేందుకు విముఖత వ్యక్తం చేసిన బీజేపీ ఎమ్మెల్యే ఒకరు ఫేక్ కోవిడ్-19 రిపోర్ట్‌ను సృష్టించి అడ్డంగా...

కోర్టునే బురిడీ కొట్టించాలని చూసిన బీజేపీ ఎమ్మెల్యే..!

కోర్టు విచారణ నుంచి తప్పించుకునేందుకు బీజేపీ ఎమ్మెల్యే ఫేక్ కోవిడ్ రిపోర్ట్.. కేసు నమోదు

లక్నో: కోర్టు విచారణకు హాజరయ్యేందుకు విముఖత వ్యక్తం చేసిన బీజేపీ ఎమ్మెల్యే ఒకరు ఫేక్ కోవిడ్-19 రిపోర్ట్‌ను సృష్టించి అడ్డంగా బుక్కయిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ సింగ్ బగ్హేల్‌పై 2010లో హత్యాయత్నం కేసు నమోదైంది. అప్పటి నుంచి ఈ కేసు విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ఎమ్మెల్యే కోర్టు విచారణకు హాజరుకావాల్సి ఉండగా.. ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ అని, అందువల్ల విచారణకు హాజరు కాలేరని చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హర్‌గోవింద్ సింగ్ కోర్టుకు రిపోర్ట్ సమర్పించారు.


అయితే.. హోం ఐసోలేషన్ సర్వేలెన్స్ బృందంలో ఒకరైన డాక్టర్ వివేక్ కుమార్ శ్రీవాత్సవ మాట్లాడుతూ.. తాము ఎమ్మెల్యే ఇంటికి పరిశీలనకు వెళ్లిన సందర్భంలో ఆయన అక్కడ లేరని, ఫోన్‌లో కూడా అందుబాటులో లేరని కోర్టుకు తెలిపారు. దీంతో.. ఎమ్మెల్యే ఫేక్ కోవిడ్-19 రిపోర్ట్‌ను కోర్టుకు సమర్పించినట్లు తేలింది. ఎమ్మెల్యేపై, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హర్‌గోవింద్ సింగ్‌పై కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో ఫోర్జరీ కేసు నమోదైంది.

Updated Date - 2020-12-27T23:09:41+05:30 IST