ప్రియాంక గాంధీని ఖాళీ చేయమన్న బంగళా అనిల్ బలూనికి కేటాయించే అవకాశం

ABN , First Publish Date - 2020-07-06T04:22:53+05:30 IST

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఖాళీ చేయనున్న ప్రభుత్వ బంగ్లాను...

ప్రియాంక గాంధీని ఖాళీ చేయమన్న బంగళా అనిల్ బలూనికి కేటాయించే అవకాశం

న్యూఢిల్లీ: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఖాళీ చేయనున్న ప్రభుత్వ బంగ్లాను బీజేపీ మీడియా సెల్ చీఫ్ అనిల్ బలూనికి కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే.. ప్రియాంకకు ఢిల్లీలోని లోథా ఎస్టేట్‌లో ఉన్న ఈ బంగ్లాను ఖాళీ చేయాల్సిందిగా భవనాలు మరియూ పట్టణ వ్యవహారాల శాఖ నోటీసులు పంపింది. ఆగస్ట్ 1 లోగా బంగ్లాను ఖాళీ చేయాలని సూచించింది.


ప్రియాంక 23 సంవత్సరాలుగా ఇదే ఇంట్లో  ఉంటున్నారు. ప్రభుత్వానికి ఆమె 3, 46, 677 రూపాయల బకాయిలు చెల్లించాల్సి ఉంది. ప్రియాంకకు ప్రస్తుతం ఎస్పీజీ రక్షణ లేదు. ఎస్పీజీ భద్రత పరిధిలో ఉన్న ప్రైవేటు పౌరులకు మాత్రమే ప్రభుత్వ నివాసాన్ని కేటాయిస్తారు. ప్రియాంకకు ప్రస్తుతం కేవలం జడ్ ప్లస్ కేటగిరి రక్షణ ఉంది. దీంతో ప్రభుత్వ బంగళా కేటాయింపు ఉండదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Updated Date - 2020-07-06T04:22:53+05:30 IST