బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కాన్వాయ్ పై రాళ్లదాడి

ABN , First Publish Date - 2020-12-10T18:59:52+05:30 IST

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బెంగాల్ పర్యటన ఉద్రిక్తంగా మారింది. ఆయన కాన్వాయ్‌పై ప్రత్యర్థులు రాళ్ల దాడి చేశారు. నడ్డా

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కాన్వాయ్ పై రాళ్లదాడి

కోల్‌కతా : బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బెంగాల్ పర్యటన ఉద్రిక్తంగా మారింది. ఆయన కాన్వాయ్‌పై ప్రత్యర్థులు రాళ్ల దాడి చేశారు. నడ్డా కాన్వాయ్ తో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కైలాస్ విజయ వర్గీయ వాహనంపై కూడా ప్రత్యర్థులు రాళ్ల దాడికి దిగారు. కోల్‌కతాలోని డైమండ్ హార్బర్ ప్రాంతంలో పర్యటిస్తున్న సందర్భంలో ఈ దాడి జరిగిందని రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ప్రకటించారు. కారులో ప్రయాణిస్తున్న సందర్భంలో జరిగిన రాళ్ల దాడిన విజయ వర్గీయ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే ఈ దాడి తృణమూల్ కాంగ్రెస్ నేతల పనే అని బీజేపీ ఆరోపించింది. అధికార తృణమూల్ నేతలు నడ్డా వాహన శ్రేణిని ఆపడానికి ప్రయత్నించారని, ఆపకపోవడంతో రాళ్లదాడికి దిగారని బీజేపీ ఆరోపించింది. 

Updated Date - 2020-12-10T18:59:52+05:30 IST