బెంగాల్‌కు మీ సొంత భద్రత తీసుకురండి...
ABN , First Publish Date - 2020-12-11T15:45:32+05:30 IST
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో బీజేపీ నేతలు పర్యటించేటపుడు మీ సొంత భద్రతను తీసుకురండి అని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా సూచించారు....
బీజేపీకి టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా సూచన
కోల్‌కతా (పశ్చిమబెంగాల్): పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో బీజేపీ నేతలు పర్యటించేటపుడు మీ సొంత భద్రతను తీసుకురండి అని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా సూచించారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్ పై బీజేపీ చేసిన ప్రాయోజిత దాడి అని ఎంపీ ఆరోపించారు. జేపీనడ్డాపై దాడి ఘటన బీజేపీ ఆడుతున్న నాటకమని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ తాజాగా నిందించారు. మీ బెంగాల్ పర్యటనల్లో సీఆర్ పీఎఫ్, సీఐఎస్ఎఫ్, కేంద్ర బలగాలను వెంట తీసుకురండి అంటూ ఎంపీ మహువా కోరారు. బీజేపీ నాయకులు జేపీనడ్డా, కైలాష్ విజయవర్గియాలు కార్యకర్తలను కలవడానికి డైమండ్ హార్బర్ ప్రాంతానికి వెళుతుండగా వారి కాన్వాయ్ పై దాడి జరిగిన విషయం విదితమే. జేపీ నడ్డా బుల్లెట్ ఫ్రూఫ్ వాహనంలో ప్రయాణిస్తుండటంతో ఆయన రాళ్ల దాడి నుంచి తప్పించుకోగలిగారు. విజయవర్గియా ప్రయాణిస్తున్న కారు కిటికీలు పగిలిపోయాయి. ఈ దాడి ఘటన టీఎంసీ, బీజేపీల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది.