సీఎం ఇంటి ముందున్న సీసీటీవీ కెమెరాలను పగులగొట్టిన బీజేపీ నేతలు

ABN , First Publish Date - 2020-12-14T01:56:44+05:30 IST

ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసం ముందు బైఠాయింపు సమ్మె జరిపిన బీజేపీ నేతలు ...

సీఎం ఇంటి ముందున్న సీసీటీవీ కెమెరాలను పగులగొట్టిన బీజేపీ నేతలు

న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసం ముందు బైఠాయింపు సమ్మె జరిపిన బీజేపీ నేతలు ఆయన ఇంటి ముందున్న సీసీటీవీ కెమేరాలను పగులగొట్టినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) ఆదివారంనాడు ఒక ప్రకటనలో తెలిపింది.


మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (సీఎంఓ) మేయర్లు, మున్సిపల్ కార్పొరేషన్ నేతలు కేజ్రీవాల్ నివాసం వద్ద ఆదివారం నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఎంసీడీకి రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడిన రూ.13,000 కోట్లు చెల్లించాలనేది నిరసనకారుల డిమాండ్‌గా ఉంది. ఇదే అంశంపై బీజేపీ కార్యకర్తలు సైతం ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ప్రదర్శనలు నిర్వహించారు.


కాగా, ఉప ముఖ్యమంత్రి సిసోడియా నివాసంపై 'బీజేపీ గూండాలు' గత గురువారంనాడు దాడి చేశారని ఆరోపిస్తూ ఆయన కార్యదర్శి సి.అరవింద్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. దీనిపై దర్యాప్తు సాగిస్తున్నామని, అది పూర్తికాగానే ఐపీసీలోని సెక్షన్ల కింద నేరాల నమోదు ఉంటుందని ఢిల్లీ పోలీసులు తెలిపారు.

Updated Date - 2020-12-14T01:56:44+05:30 IST