బీజేపీ సీనియర్ నేత సత్పాల్ కన్నుమూత
ABN , First Publish Date - 2020-12-02T04:18:08+05:30 IST
సీనియర్ బీజేపీ నేత, పంజాబ్ మాజీ మంత్రి సత్పాల్ గోసాయిన్ మంగళవారం కన్నుమూశారు. కొద్దిపాటి అస్వస్థతకు గురైన...

లూదియానా: సీనియర్ బీజేపీ నేత, పంజాబ్ మాజీ మంత్రి సత్పాల్ గోసాయిన్ మంగళవారం కన్నుమూశారు. కొద్దిపాటి అస్వస్థతకు గురైన 85 ఏళ్ల ఆయనను లూదియానాలోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీ ఆస్పత్రి తరలించారు. అయితే ఆయన అప్పటికే మృతి చెందినట్టు ఆస్పత్రి డైరెక్టర్ విలియమ్ భట్టి వెల్లడించారు. సత్పాల్‌కు భార్య, కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కాగా సత్పాల్ మృతిపట్ల పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి తనను తీవ్రంగా బాధించిందని సీఎం పేర్కొన్నారు. లూదియానా నగర అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం ఆయన అందించిన సేవలు మరువలేనివంటూ కొనియాడారు. బీజేపీ కురువృద్ధుడిగా పేరున్న సత్పాల్ మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. పంజాబ్ కేబినెట్‌లో ఆరోగ్యమంత్రిగానూ పనిచేశారు.