సొలిసిటర్ జనరల్‌ను కలిసిన బీజేపీ నేతలు

ABN , First Publish Date - 2020-03-15T20:53:53+05:30 IST

మధ్యప్రదేశ్‌లో తలెత్తిన రాజకీయ సంక్షోభం నేపథ్యంలో పలువురు బీజేపీ నేతలు సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఆయన నివాసంలో ఆదివారంనాడు ..

సొలిసిటర్ జనరల్‌ను కలిసిన బీజేపీ నేతలు

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లో తలెత్తిన రాజకీయ సంక్షోభం నేపథ్యంలో పలువురు బీజేపీ నేతలు సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఆయన నివాసంలో ఆదివారంనాడు కలుసుకున్నారు. నరేంద్ర సింగ్ తోమర్, ధర్మేంద్ర ప్రధాన్, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఇటీవలే బీజేపీలో చేరిన సీనియర్ నేత జ్యోతిరాదిత్య సంధియా తదితరులులు తుషార్ మెహతాను కలిసిన వారిలో ఉన్నారు. కమల్‌నాథ్ సారథ్యంలోని మధ్యప్రదేశ్ ప్రభుత్వం సోమవారంనాడు అసెంబ్లీలో బలపరీక్షకు సిద్ధమవుతున్న తరుణంలో బీజేపీ ప్రముఖులు సొలిసిటర్ జనరల్‌ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

బీజేపీ విప్ జారీ...
కాగా, కమల్‌నాథ్ సర్కార్ బలపరీక్ష నేపథ్యంలో సోమవారంనాడు అసెంబ్లీకి తప్పనిసరిగా పార్టీ ఎమ్మెల్యేలంతా హాజరుకావాలని బీజేపీ విప్ జారీ చేసింది. కాంగ్రెస్ సైతం ఈనెల 16 నుంచి ఏప్రిల్ 13 వరకూ జరిగే అసెంబ్లీ సమావేశాలకు తప్పనిసరిగా హాజరుకావాలని తమ ఎమ్మెల్యేలకు శనివారంనాడు విప్ జారీ చేసింది. మరోవైపు, సింధియాకు విధేయులుగా బెంగళూరు తరలివెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం ఆదివారం ఉదయం భోపాల్ చేరుకున్నారు. ఇదే సమయంలో, కాంగ్రెస్ నేతలు దిగ్విజయ్ సింగ్, శోభా ఓజా, తదితరులు కమల్‌నాథ్ నివాసానికి చేరుకుని బలపరీక్షలో పైచేయి సాధించేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై మంతనాలు సాగిస్తున్నారు.

Updated Date - 2020-03-15T20:53:53+05:30 IST