సీఎం మమత అహంకారం వల్ల బెంగాల్ రైతులు నష్టపోయారు : అమిత్ మాలవ్య

ABN , First Publish Date - 2020-12-25T20:01:42+05:30 IST

రైతుల అకౌంట్లలోకి ప్రధాని మోదీ 18,000 కోట్ల రూపాయలను విడుదల చేసిన నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీపై బీజేపీ ఐటీ సెల్

సీఎం మమత అహంకారం వల్ల బెంగాల్ రైతులు నష్టపోయారు : అమిత్ మాలవ్య

కోల్‌కతా : రైతుల అకౌంట్లలోకి ప్రధాని మోదీ 18,000 కోట్ల రూపాయలను విడుదల చేసిన నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీపై బీజేపీ ఐటీ సెల్ ఇన్‌చార్జి అమిత్ మాలవ్య తీవ్రంగా మండిపడ్డారు. ‘‘నేడు ప్రధాని మోదీ రైతుల అకౌంట్లలోకి 18,000 కోట్లను బదిలీ చేశారు. దేశవ్యాప్తంగా 9 కోట్ల రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరింది. లబ్ధిదారుల జాబితాను గుర్తించి, కేంద్ర ప్రభుత్వానికి సమర్పించమంటే దానిని మమత తిరస్కరించారు. ఆమె అహంకారంతో రైతులు నష్టపోయారు.’’ అని అమిత్ మాలవ్యా తీవ్రంగా మండిపడ్డారు. అయితే దీనిపై తృణమూల్ కౌంటర్ ఇచ్చింది. కేంద్రం ఇచ్చిన నిధుల కంటే రాష్ట్ర ప్రభుత్వమే రైతులకు అధికంగా ఆర్థిక సహాయం చేస్తోందని ఎంపీ సౌగతా రాయ్ పేర్కొన్నారు. ‘‘కేంద్రం నేరుగా ఆర్థిక సహాయం అందించడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం. రైతులకు తమ ప్రభుత్వం తరపున 5,000 రూపాయలను అందిస్తున్నాం. ఇది కేంద్రం ఇచ్చే సహాయం కంటే అధికమైంది.’’ అని సౌగతా రాయ్ పేర్కొన్నారు. 

Updated Date - 2020-12-25T20:01:42+05:30 IST