నంబర్‌గేమ్‌లో బీజేపీకే చాన్స్
ABN , First Publish Date - 2020-09-20T08:18:42+05:30 IST
వ్యవసాయానికి సంబంధించిన మూడు బిల్లులను కేంద్ర ప్రభుత్వం ఆదివారం రాజ్యసభలో ప్రవేశపెట్టనుంది. ఎన్డీయేకు పూర్తి మెజార్టీ ఉండడంతో ఈ మూడు బిల్లులు గతవారం సునాయాశంగా లోక్‌సభ ఆమోదం పొందాయి...

- నేడు రాజ్యసభకు వ్యవసాయ బిల్లులు
- రాజ్యసభలో బీజేపీకి స్వల్ప మెజార్టీ
- ‘నమ్మకమైన మిత్రుల’ సాయంపై ధీమా
- కాంగ్రె్‌సకు కలిసిరాని భాగస్వామ్యపార్టీలు
- బిల్లుకు అనుకూలంగా శివసేన
- ఎన్సీపీతోనూ బీజేపీ చర్చలు
న్యూఢిల్లీ, సెప్టెంబరు 19: వ్యవసాయానికి సంబంధించిన మూడు బిల్లులను కేంద్ర ప్రభుత్వం ఆదివారం రాజ్యసభలో ప్రవేశపెట్టనుంది. ఎన్డీయేకు పూర్తి మెజార్టీ ఉండడంతో ఈ మూడు బిల్లులు గతవారం సునాయాశంగా లోక్‌సభ ఆమోదం పొందాయి. రాజ్యసభలో సర్కార్‌కు ప్రతిపక్షాల నుంచి ప్రతిఘటన తప్పకపోయినా నెం బర్గేమ్లో బీజేపీ ముందుండడంతో ప్రభుత్వానికి వచ్చే ఇబ్బంది ఏమీ లేదంటున్నారు. అధికారపార్టీ బిల్లులను ఆమోదించుకోవాలని గట్టిపట్టుదలతో ఉండగా..వాటిని ఎలాగైనా అడ్డుకోవాలని కాంగ్రెస్ వ్యూహాలను రచిస్తోంది.
పెద్దలసభలో బీజేపీకి సొంతబలం లేదు. అందుకోసం ఎన్డీయే మిత్రపక్షాలు, ఇతర స్నేహపూర్వక పార్టీల మద్ద తు కోసం ప్రయత్నిస్తోంది. రైతు ఉత్పత్తులకు కనీస మ ద్దతు ధర (ఎమ్మెస్పీ)కు ఎలాంటి ఢోకాలేదని ప్రధాని న రేంద్ర మోదీ హామీ ఇచ్చినా.. కేంద్ర బిల్లులు రైతు వ్యతిరేకమంటూఆందోళనలు జరిగాయి. ముఖ్యంగా పంజాబ్, హర్యానాలో దీని ప్రభావం ఎక్కువగా కనిపించింది. బీజేపీకి ఎంతోకాలంగా నమ్మకమైన మిత్రపక్షంగా ఉన్న అకాలీదళ్ బిల్లులను తీవ్రంగా వ్యతిరేకించింది. కేంద్రం తీరు ను నిరసిస్తూ అకాలీదళ్ తరపున కేబినెట్లో ప్రాతినిధ్యం వహిస్తున్న హర్సిమ్రాత్ కౌర్ బాదల్ మంత్రిపదవికి రా జీనామా చేశారు. ఎన్డీయేలో కొనసాగాలా? తెగతెంపులు చేసుకోవాలా? అన్న అంశంపై సమీక్షిస్తామని ఆపార్టీ నేతలు ప్రకటించారు.
బలాబలాలపై ఆసక్తి
రాజ్యసభలో బిల్లులపై ఓటింగ్ జరిగితే పార్టీల బలాబలాలుఎలా ఉంటాయన్నదానిపై రాజకీయవర్గాల్లో ఆసక్త్తి నెలకొంది. రాజ్యసభలో మొత్తం సభ్యులు 243 ఉండగా..మెజార్టీ మార్క్ 122. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే తనకు 105 ఓట్లు వస్తాయని అంచనా వేస్తోంది. ఇప్పటికే కోవిడ్ పాజిటివ్‌తో 10 మంది ఎంపీలు హోంక్వారెంటైన్లో ఉన్నారు. మరో 15 మంది సభ్యులు సభకు రాలేమని సమాచారం ఇచ్చారు.
బిల్లుల ఆమోదానికి అవసరమైన మెజార్టీ సాధించడానికి ఈ పరిణామాలు బీజేపీ కి అనుకూలిస్తాయంటున్నారు. బీజేపీకి రాజ్యసభలో 86 మంది సభ్యులున్నారు. ఎన్డీయే భాగస్వామ్యపార్టీలతో కలుపుకుంటే దాని బలం 105గా ఉంది. వ్యతిరేకంగా ఓటేయాలంటూ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలకు అకాలీదళ్ ఇప్పటికే విప్ జారీచేసింది. అకాలీదళ్ కలిసిరాకున్నా.. బిల్లుల ఆమోదానికి అవసరమైన మద్దతు ఇతర పార్టీల నుంచి లభించగలదన్న నమ్మకాన్ని బీజేపీ వ్యక్తంచేస్తోంది. బిజూ జనతాదళ్ (9 మంది), వైసీపీ (ఆరుగురు) లాంటి ‘ప్రాంతీయ స్నేహితులు’ తమకు కష్టకాలంలో అండగా ఉంటారని బీజేపీ ధీమాగా ఉంది. కొన్ని కీలకమైన బిల్లులపై ఓటింగ్ జరిగినప్పుడు ఈ పార్టీలు బీజేపీని ఎలా ఆదుకున్నాయో గుర్తుచేస్తున్నారు. ఓటింగ్ అవసరమైతే.. తమకు 135 మంది ఎంపీలు మద్దతు ప్రకటిస్తారని బీజేపీ అధిష్ఠానం నమ్ముతోంది.
కాంగ్రె్‌సకు ‘మిత్రుల’ షాక్!
కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాల విషయానికి వస్తే.. విపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి రావడం అనుమానమేనని అం టున్నారు. కాంగ్రె్‌సకు రాజ్యసభలో 40 మంది ఎంపీలున్నారు. 13 మంది సభ్యులున్న తృణమూల్ కాంగ్రెస్ ఆదివారంనాటి సభలో కాంగ్రె్‌సకు అనుకూలంగా వ్యవహరించడం అనుమానమేనని అంటున్నారు. మహారాష్ట్రలో కాంగ్రె్‌సతోపాటు అధికా రం పంచుకుంటున్న శివసేన (రాజ్యసభలో ముగ్గురు ఎంపీలు) మద్దతు ఇస్తామని ప్రకటించి హస్తం పార్టీకి షాక్ ఇచ్చింది. ఎన్సీపీ ( నలుగురు ఎంపీలు) మద్దతు కోసం ఇప్పటికే ఆపార్టీని సంప్రదించినట్టు బీజేపీ వర్గాలు చె ప్పాయి. బీజేడీ, వైసీపీ మద్దతు కోసం యత్నించినా అవి స్పందంచలేదని వార్తలొచ్చాయి. బీఎస్పీ (4), ఎస్పీ (8), ఆప్(3)లాంటి పార్టీలు కలిసి ఉన్నా బిల్లుల్ని ఓడించే పరిస్థితి ఉండదంటున్నారు.