బీజేపీ ఎమ్మెల్యే అనుమానాస్పద మృతిపై షాను కలిసిన బీజేపీ బృందం

ABN , First Publish Date - 2020-07-15T02:17:59+05:30 IST

కోల్‌కతా: బీజేపీ ఎమ్మెల్యే దేబేంద్ర నాథ్ అనుమానాస్పద మృతిపై బీజేపీ నేతల బృందం కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కలిసింది. ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరింది.

బీజేపీ ఎమ్మెల్యే అనుమానాస్పద మృతిపై షాను కలిసిన బీజేపీ బృందం

కోల్‌కతా: బీజేపీ ఎమ్మెల్యే దేబేంద్ర నాథ్ అనుమానాస్పద మృతిపై బీజేపీ నేతల బృందం కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కలిసింది. ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరింది. షాను కలిసిన బృందంలో కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో, ఎంపీ స్వపన్ దాస్ గుప్తా, బీజేపీ పశ్చిమ బెంగాల్ వ్యవహారాల ఇంఛార్జ్ కైలాస్ విజయవర్గీయ తదితరులున్నారు. 



బీజేపీ ఎమ్మెల్యే దేబేంద్ర నాథ్ తన గ్రామానికి సమీపంలోని బిందాల్ వద్ద అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ఆయన ఉరి వేసుకున్నట్లుగా మెడకు తాడు ఉంది. దీనిపై బీజేపీ అనుమానాలు వ్యక్తం చేసింది. తమ ఎమ్మెల్యేను హత్య చేసి ఉరివేసుకున్నట్లుగా చిత్రీకరించారని ఆరోపించింది. మమత పాలనలో తృణమూల్ కార్యకర్తల హింస పరాకాష్టకు చేరిందని బీజేపీ ఆరోపించింది. 


బీజేపీ ఎమ్మెల్యే దేబేంద్ర నాథ్ అనుమానాస్పద మృతికి నిరసనగా బీజేపీ ఉత్తర పశ్చిమబెంగాల్ బంద్ నిర్వహించింది. బీజేపీకి చెందిన మరో బృందం రాష్ట్రపతిని కలిసి పశ్చిమబెంగాల్‌లో హింసపై ఫిర్యాదు చేసింది. 

Updated Date - 2020-07-15T02:17:59+05:30 IST