ఈ నెల 30 నుంచి తమిళనాడులో నడ్డా పర్యటన

ABN , First Publish Date - 2020-12-11T16:52:20+05:30 IST

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

ఈ నెల 30 నుంచి తమిళనాడులో నడ్డా పర్యటన

చెన్నై : భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తమిళనాడు, పుదుచ్చేరిలలో మూడు రోజులు పర్య టించనున్నారు. జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ఆయన అన్ని రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. ముఖ్యంగా, అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, కేరళ తదితర మూడు రాష్ట్రాలపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. ఈ మూడు రాష్ట్రాల్లో కార్యకర్తలను ఎన్నికలకు సన్నద్ధం చేసే చర్యలను పార్టీ అధిష్ఠానం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో, తమిళనాడు, పుదుచ్చేరిలో ఆయన మూడు రోజులు పర్యటించనున్నారు.


ఈనెల 30న నగరానికి చేరు కోనున్న జేపీ నడ్డా, రాష్ట్ర, జిల్లా నిర్వాహకులతో సమావేశం కానున్నారు. మరుసటిరోజు మదురై చేరుకొని నిర్వాహ కులతోను, 1వ తేదీ పుదుచ్చేరి చేరుకొని రాష్ట్ర, జిల్లా నిర్వాహకులతో సమావేశం కానున్నారు. వచ్చే ఏడాది జరుగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకొని రాష్ట్రంలో ప్రస్తుత పార్టీ పరిస్థితి, కూటమి ఏర్పాటు, విజయావ కాశాలపై చర్చించి, పార్టీ విజయానికి సూచనలు, సలహాలివ్వనున్నారు. ఈ నేపథ్యంలో, అన్ని జిల్లా ల్లో బూత్‌ కమిటీలు సత్వరం నియమించాలని జిల్లా నిర్వాహకులకు పార్టీ అధిష్ఠానం లేఖలు రాసింది. రాష్ట్ర బీజేపీ చేపట్టిన ‘వేల్‌’ యాత్ర ముగింపు సభలో జేపీ నడ్డా పాల్గొంటారని ప్రకటించినా, ఆ సమయంలో వస్తే ఒకే సభలా ఉంటుందని, రాబోయే ఎన్నికలకు కార్య కర్తలను సిద్ధం చేసేలా తాజాగా ఆయన పర్యటన చేపట్టారని పార్టీ శ్రేణులు తెలిపాయి.

Updated Date - 2020-12-11T16:52:20+05:30 IST