‘‘మోదీ ఎంటర్ కానివ్వండి... సీన్ మొత్తం మారిపోతుంది’’

ABN , First Publish Date - 2020-10-21T20:39:45+05:30 IST

ఆర్జేడీ యువనేత తేజస్వీ యాదవ్‌కు రానూ రానూ ప్రజాదరణ పెరుగుతోందని సర్వేలు వెల్లడించాయి. ఆయన నిర్వహించే సభలకు కూడా

‘‘మోదీ ఎంటర్ కానివ్వండి... సీన్ మొత్తం మారిపోతుంది’’

న్యూఢిల్లీ : ఆర్జేడీ యువనేత తేజస్వీ యాదవ్‌కు రానూ రానూ ప్రజాదరణ పెరుగుతోందని సర్వేలు వెల్లడించాయి. ఆయన నిర్వహించే సభలకు కూడా ప్రజలు అధిక సంఖ్యలో హాజరువుతున్నారని కూడా సర్వేలు వెల్లడించాయి. అయితే దీనిపై అధికార బీజేపీ పక్షం అనధికారికంగా స్పందించింది. ‘‘తేజస్వీ యాదవ్ ర్యాలీలకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరు కావడం అత్యంత సహజం. లాలూ హయాంలో కూడా అలాగే వచ్చేవారు. కానీ... ప్రధాని మోదీ ఎంటర్ కానివ్వండి.. సీన్ మొత్తం మారిపోతుంది. మోదీ సభలు ప్రారంభం కాగానే.. సీన్ మొత్తం మారిపోతుంది.’’ అని బీజేపీ ప్రకటించింది.


తేజస్వీ యాదవ్ నిర్వహించే ర్యాలీలపై బీజేపీ అధిష్ఠానం ముందు నుంచీ ఓ కన్నేసి ఉంచుతోంది. ఆ సభలకు లభించే జనాదరణపై కూడా బీజేపీ ఓ కన్నేసింది. అయితే... తేజస్వీ ర్యాలీలకు జనం అధికంగా ఆకర్షితులవుతున్నారని సర్వేలు కూడా వెల్లడించిన నేపథ్యంలో కమలం శిబిరం అప్రమత్తమైంది. ‘‘ఇవన్నీ అత్యంత సహజం.. లాలూ హయాంలోనూ ఇలాగే జరిగింది. ఆర్జేడీ ఆధిక్యం ఉన్న ప్రాంతాల్లో ఇది అత్యంత సహజం’’ అని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రధాని మోదీ, సీఎం నితీశ్ కలిసి సభలు నిర్వహిస్తాం... ఎన్డీయే ఐక్యతను చాటుతాం.. అప్పుడు పరిస్థితి మారిపోతుంది...’’ అని బీజేపీ ముఖ్యులు పేర్కొంటున్నారు. 


Updated Date - 2020-10-21T20:39:45+05:30 IST