ఐదు పైసలకే ప్లేట్‌ చికెన్‌ బిర్యానీ!

ABN , First Publish Date - 2020-09-06T17:33:39+05:30 IST

రామనాథపురంలో 5 పైసలుకు ప్లేట్‌ చికెన్‌ బిర్యానీ కొనుగోలు చేసేందుకు భోజనప్రియులు బారులు తీరారు. రామనాథపురం, కీళక్కరై, పనైకుళం ప్రాంతాల్లో అధికంగా బిర్యానీ

ఐదు పైసలకే ప్లేట్‌ చికెన్‌ బిర్యానీ!

చెన్నై (పెరంబూర్‌): రామనాథపురంలో 5 పైసలుకు ప్లేట్‌ చికెన్‌ బిర్యానీ కొనుగోలు చేసేందుకు భోజనప్రియులు బారులు తీరారు. రామనాథపురం, కీళక్కరై, పనైకుళం ప్రాంతాల్లో అధికంగా బిర్యానీ దుకాణాలున్నాయి. ఆ ప్రాంతాల్లో వెళ్తుంటే బిర్యానీ వాసన నోరూరిస్తుంటుంది. ఈ క్రమంలో, శుక్రవారం ఓ బిర్యానీ దుకాణంలో 5 పైసలకే ప్లేట్‌ చికెన్‌ బిర్యానీ, పెరుగు పచ్చడి, వంకాయ కుర్మా అందిస్తున్నామనే ప్రకటనతో మాంసంప్రియులు బారులు తీరారు. 5 పైసలు చెల్లించి బిర్యానీ తీసుకెళ్లారు. ఈ విషయమై దుకాణ యజమాని ఫరత్‌ మాట్లాడుతూ... రామనాథపురం ఈస్ట్‌కోస్ట్‌ రోడ్డులో కొత్త బిర్యానీ దుకాణాన్ని ప్రారంభించానని, మాంసాహారప్రియులను ఆకట్టుకొనేలా 5 పైసలకే ప్లేట్‌ చికెన్‌ బిర్యానీ అందిస్తున్నట్టు ప్రకటించానన్నారు. అలాగే, పాత నాణేలపై ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశం కూడా ఇందులో ఇమిడి ఉందన్నారు. 150మంది వరకు 5 పైసలు చెల్లించి బిర్యానీ కొనుగోలు చేశారని ఫరత్‌ తెలిపారు.

Updated Date - 2020-09-06T17:33:39+05:30 IST