మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌కు పితృవియోగం

ABN , First Publish Date - 2020-09-16T15:37:07+05:30 IST

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌కు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి విలియమ్ హెచ్ గేట్స్ (94) సోమవారం నాడు మృతి చెందారు.

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌కు పితృవియోగం

వాషింగ్టన్: మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌కు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి విలియమ్ హెచ్ గేట్స్ (94) సోమవారం నాడు మృతి చెందారు. కుటుంబ సభ్యుల నడుమ తన తండ్రి తుది శ్వాస విడిచారని బిల్ గేట్స్ తెలిపారు. గత కొంత కాలంగా ఆయన ఆరోగ్యం క్షిణిస్తూవస్తోందని, అనివార్యమైన ఈ రోజుకు తాము మానసికంగా సిద్ధమయ్యామని గేట్స్ తెలిపారు. బిల్‌ గేట్స్ తండ్రి ఆల్జైమర్స్ వ్యాధితో సతమతమయ్యారు. సమాజ సేవ కోసం గేట్స్..బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ స్థాపించే క్రమంలో ఆయన తండ్రి ఎంతో తోడ్పాటునందించారు. 


‘ఆయనను ఎంతగా మిస్ అవుతామో మాటల్లో వర్ణించలేము. తన మేధస్సు, నమత్ర, ఉదారత ద్వారా నా తండ్రి తన చుట్టూ ఉన్న వారిని ఎంతో ప్రభావితం చేశారు. వారు మాకు తల్లిదండ్రులుగా లభించడం నేను, నా తొబుట్టువులు చేసుకున్న అదృష్టం. ఆయన నాపై ఎంతో ప్రభావం చూపించారు. నేను ఆయనలా ఉండేందుకు ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నాను. నా తండ్రే అసలైన బిల్ గేట్స్. ఆయన్ను ప్రతిరోజూ మిస్సవుతా’ అని బిల్ గేట్స్ తన బ్లాగులో రాశారు. 

Updated Date - 2020-09-16T15:37:07+05:30 IST