మేం రైతు బిడ్డలం: షహీన్‌బాగ్ దాదీ మద్దతు

ABN , First Publish Date - 2020-12-01T22:36:52+05:30 IST

మేం రైతు బిడ్డలం: షహీన్‌బాగ్ దాదీ మద్దతు

మేం రైతు బిడ్డలం: షహీన్‌బాగ్ దాదీ మద్దతు

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా రాజధాని ఢిల్లీలోని హషీన్‌బాగ్‌లో జరిగిన నిరసనతో పేరుగాంచిన బిల్కిస్ దాదీ.. తాజాగా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన నిరసనకు మద్దతు పలికారు. తాము రైతుల బిడ్డలమని, వారు చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలని గుర్తు చేశారు. రైతుల ఆవేదనను ప్రభుత్వం వినాలని డిమాండ్ చేశారు. రైతుల నిరసనకు మద్దతు తెలిపేందుకు బిల్కిస్ దాదీ, సింఘ్ సరిహద్దుకు చేరుకున్నారు.


‘‘మేం రైతుల బిడ్డలం. వారు కష్టాల్లో ఉండి నిరసన చేస్తుంటే మేమెట్లా చూస్తూ ఊరుకుంటాం? అందుకే రైతు నిరసనకు మద్దతు తెలిపేందుకు మనమంతా ముందుకు కదలాలి. మనం రైతుల గొంతుకను వినాలి, ప్రభుత్వానికి వినిపించేందుకు సహకరించాలి. ప్రభుత్వం రైతుల ఆవేదన వినాలి. రైతుల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలి’’ అని బిల్కిస్ దాదీ అన్నారు.

Updated Date - 2020-12-01T22:36:52+05:30 IST