బాణసంచాతో నిప్పంటుకుని లక్షల రూపాయల ఆస్తి నష్టం
ABN , First Publish Date - 2020-11-15T11:56:59+05:30 IST
కరోనా కాలంలోనూ దీపావళి వేడుకలు మిన్నంటాయి. అయితే ఇదే...

మోతిహరి: కరోనా కాలంలోనూ దీపావళి వేడుకలు మిన్నంటాయి. అయితే ఇదే సమయంలో బీహార్‌లోని మోతిహరిలో ఒక ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీపావళి బాణసంచా కారణంగా సోనావర్ష్ చౌక్‌లో మంటలు చెలరేగాయి. దీంతో అక్కడున్న కొన్ని దుకాణాలలోని వస్తువులు కాలి బూడిదయ్యాయి.
ప్రమాదాన్ని గ్రహించిన వెంటనే స్థానికులు మంటలను ఆపే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే జాప్యం కావడంతో లక్షల రూపాయలు విలువచేసే వస్తువులు కాలిబూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. బాధితునికి ప్రస్తుతం మోతిహరి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మరో అగ్నిప్రమాద ఘటన రామ్‌పూర్ ఖజురియా గ్రామంలో చోటుచేసుకుంది. బాణసంచా నుంచి వెలువడిన నిప్పురవ్వల కారణంగా ఒక ఇంటిలో నిప్పంటుకుంది. చూస్తుండగానే ఇల్లంతా మంటలు వ్యాపించి, ఇంట్లోని వస్తువులన్నీ దగ్ధమయ్యాయి.