బీహార్ ఆరోగ్య శాఖ కార్యదర్శి మార్పు.. 2 నెలల్లో రెండోసారి

ABN , First Publish Date - 2020-07-28T21:19:09+05:30 IST

రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శిని పదవి నుంచి తొలగించినట్లు బీహార్ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. దీంతో రెండు నెలల కాలంలో...

బీహార్ ఆరోగ్య శాఖ కార్యదర్శి మార్పు.. 2 నెలల్లో రెండోసారి

పాట్నా: రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శిని పదవి నుంచి తొలగించినట్లు బీహార్ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. దీంతో రెండు నెలల కాలంలో ఈ పదవిలో ఇద్దరిని మార్చినట్లయింది. ప్రస్తుతం దేశంలో కరోనా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం శోచనీయం. ఈ ఏడాది మే 21న సంజయ్ కుమార్‌ను ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలిసారిగా ప్రభుత్వం తొలగించింది. ఆయన పదవిలో ఐఏఎస్ అధికారి ప్రత్యయ అమ్రిత్‌ను నియమించింది. అయితే కేవలం కొద్ది రోజుల్లోనే ఆయనను కూడా తొలగించి ఉదయ్ సింగ్ కుమావత్‌ను నియమించింది. అయితే ప్రస్తుతం ఆయనను కూడా పదవి నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు తలెత్తుతున్నాయి.

Updated Date - 2020-07-28T21:19:09+05:30 IST