బిహార్ మొదటి దశ పోలింగ్ ఓటింగ్ 53.54%
ABN , First Publish Date - 2020-10-29T02:54:08+05:30 IST
2015 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తంగా 56.1 శాతం పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లోనూ కాస్త అటు ఇటుగా అదే ఓటింగ్ శాతం నమోదు అయ్యేట్లు కనిపిస్తోంది. మొదటి దశ పోలింగ్ కాస్త తక్కువే అయినప్పటికీ మిగిలిన

పాట్నా: బిహార్ అసెంబ్లీకి జరిగిన మొదటి దశ పోలింగ్‌లో 53.54 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల కమిషన్ పేర్కొంది. రాష్ట్రంలోని 71 నియోజవకర్గాలకు జరిగిన పోలింగ్ ఉదయం 7:00కు ప్రారంభమై సాయంత్రం 6:00 వరకు కొనసాగింది. పోలింగ్ ముగిసేసరికి 53.54 శాతం ఓటింగ్ నమోదు అయింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన పోలింగ్‌తో పోల్చుకుంటే ఈ సారి ఓటింగ్ స్వల్పంగా తగ్గింది. 2015లో జరిగిన ఎన్నికల్లో మొదటి దశ పోలింగ్‌లో 54.94 శాతం పోలింగ్ నమోదు అయింది. ఇక 2019 లోక్‌సభ ఎన్నికల్లో మొదటి దశ పోలింగ్‌లో 53.54 నమోదు అయింది.
2015 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తంగా 56.1 శాతం పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లోనూ కాస్త అటు ఇటుగా అదే ఓటింగ్ శాతం నమోదు అయ్యేట్లు కనిపిస్తోంది. మొదటి దశ పోలింగ్ కాస్త తక్కువే అయినప్పటికీ మిగిలిన రెండు దశల్లో మరింత ఓటింగ్ నమోదు కావొచ్చు. ఎన్నికలకు ముందు బిహార్‌లో ఓటింగ్ శాతం పెరుగుతుందనే అంచనాలు కొన్ని వచ్చినప్పటికీ అవి వాస్తవం కాదని మొదటి దశ పోలింగ్ నిరూపించింది.