బీహార్ ఎన్నికలు: మెదటి, రెండవ దశలకు మించి ఓటర్లలో ఉత్సాహం

ABN , First Publish Date - 2020-11-07T14:46:25+05:30 IST

బీహార్‌లో ఈరోజు అసెంబ్లీ ఎన్నికల మూడవ దశ పోలింగ్ జరుగుతోంది. మొదటి, రెండవ...

బీహార్ ఎన్నికలు: మెదటి, రెండవ దశలకు మించి ఓటర్లలో ఉత్సాహం

పట్నా: బీహార్‌లో ఈరోజు అసెంబ్లీ ఎన్నికల మూడవ దశ పోలింగ్ జరుగుతోంది. మొదటి, రెండవ దశల కన్నా ఈసారి ఓటర్లలో ఉత్సాహం కనిపిస్తోంది. మొదటి దశ పోలింగ్‌లో యువత అధికంగా కనిపించింది. మొదటి, రెండవ దశ పోలింగ్‌లో రాష్ట్రంలోని సగం జనాభా తమ ఓటు హక్కు వినియోగించుకుంది. 


ఈ రోజు జరుగుతున్న పోలింగ్‌లో మహిళా ఓటర్ల సంఖ్య అధికంగా కనిపిస్తోంది. పలు పోలింగ్ కేంద్రాలలో ఈవీఎంలు మొరాయిస్తున్నప్పటికీ, ఓటర్లు ఉత్సాహంగా ఓటు వేసేందుకు ఎదురు చూస్తున్నారు. ఈరోజు జరుగుతున్న బీహార్ ఎన్నికల తుదిదశ పోలింగ్‌లో మొత్తం 78 అసెంబ్లీ సీట్లకు ఓటింగ్ జరుగుతోంది. మధెపురాలో ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ బూత్ ముందు ఓటర్లు బారులు తీరారు. వృద్ధులు సైతం తమవారి సాయంతో పోలింగ్ కేంద్రాలకు చేరుకుని, తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సమస్తీ‌పూర్ పరిధిలోని మోర్వా అసెంబ్లీ సీటు పరిధిలోని పోలింగ్ బూత్‌లలో మహిళా ఓటర్లు అధికంగా కనిపిస్తున్నారు.


Updated Date - 2020-11-07T14:46:25+05:30 IST