ఈవీఎంలపై వదంతులు సృష్టించిన ముగ్గురు అరెస్టు
ABN , First Publish Date - 2020-11-03T14:58:09+05:30 IST
బీహార్ ఎన్నికల్లో రెండవదశ పోలింగ్ ఈరోజు ముమ్మరంగా కొనసాగుతోంది. మొత్తం 94 సీట్లకు...
పట్నా: బీహార్ ఎన్నికల్లో రెండవదశ పోలింగ్ ఈరోజు ముమ్మరంగా కొనసాగుతోంది. మొత్తం 94 సీట్లకు పోలింగ్ జరుగుతోంది. ఈ రోజు జరుగుతున్న ఎన్నికల్లో ఆర్జేడీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్, ప్లూరల్స్ పార్టీ సీఎం అభ్యర్థి పుష్పం ప్రియా తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. కాగా గోపాల్‌గంజ్‌లో ఎన్నికలు జరుగుతున్న నేపధ్యంలో ఈవీఎంకు ఫొటో తీసిన ఒక యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి మొబైల్ ఫోను స్వాధీనం చేసుకుని, ప్రశ్నిస్తున్నారు. ఇదేవిధంగా గోపాల్‌గంజ్‌లో ఈవీఎంలు పాడయిపోయాయని వదంతులు వ్యాపింపజేస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.