ఇప్పుడు బీహార్‌లో.. సామూహిక అత్యాచారానికి గురైన బాలిక ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-10-03T20:55:20+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో దళిత యువతిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన ఓ వైపు ప్రకంపనలు రేపుతుండగానే, బీహార్‌లో అటువంటి

ఇప్పుడు బీహార్‌లో.. సామూహిక అత్యాచారానికి గురైన బాలిక ఆత్మహత్య

పాట్నా: ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో దళిత యువతిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన ఓ వైపు ప్రకంపనలు రేపుతుండగానే, బీహార్‌లో అటువంటి ఘటనే చోటుచేసుకుంది. నలుగురు వ్యక్తులు తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడడంతో తట్టుకోలేని బాలిక ఆత్మహత్య చేసుకుంది. బాధిత బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తమ కుమార్తెపై అఘాయిత్యానికి తెగబడిన నలుగురిలో ముగ్గురు.. రాహుల్ కుమార్, చింటు కుమార్, చందన్ కుమార్‌లు ఉన్నారని, నాలుగో వ్యక్తి పేరు తెలియదని బాలిక తల్లిదండ్రులు పేర్కొన్నారు. బాలిక మృతదేహానికి గయ మెడికల్ కాలేజీలో శవపరీక్ష నిర్వహించారు. ఫలితం రావాల్సి ఉంది.   

Updated Date - 2020-10-03T20:55:20+05:30 IST