బీహార్‌: 24 గంట‌ల్లో కొత్త‌గా 29 క‌రోనా కేసులు

ABN , First Publish Date - 2020-05-09T15:10:31+05:30 IST

బీహార్‌లో కరోనా పాజిటివ్ రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో కొత్త‌గా 29 కొత్త కరోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో రాష్ట్రంలో‌ రోగుల సంఖ్య 579 కు చేరింది. ఈ సంద‌ర్భంగా ...

బీహార్‌: 24 గంట‌ల్లో కొత్త‌గా 29 క‌రోనా కేసులు

పాట్నా: బీహార్‌లో కరోనా పాజిటివ్ రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో కొత్త‌గా 29 కొత్త కరోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో రాష్ట్రంలో‌ రోగుల సంఖ్య 579 కు చేరింది.  ఈ సంద‌ర్భంగా బీహార్ ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలోని పట్నాలో 5, దర్భాంగాలో 5, సమస్తిపూర్‌లో 4, ఖగారియాలో 4, సహర్సాలో 2, నవాడా, నలందా, కటిహార్, బెగుసరై, బంకా, భాగల్పూర్, తూర్పు చంపారన్ నుంచి ఒక్కో క‌రోనా పాజిటివ్ కేసు చొప్పున న‌మోదయిన‌ట్లు తెలిపారు. కాగా బీహార్‌లో కరోనా ఇన్‌ఫెక్షన్ 36 జిల్లాలకు వ్యాపించింది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్  రోగుల సంఖ్య 579 కు చేరింది.  క‌రోనా సోకిన 579 మంది రోగులలో 287 మంది చికిత్స తర్వాత కోలుకొని, ఇంటికి చేరుకున్నారు. కాగా ఐదుగురు క‌రోనా ఇన్‌ఫెక్షన్ కారణంగా మృతి చెందారు.

Updated Date - 2020-05-09T15:10:31+05:30 IST