ఉత్సాహంగా ఓటు వేస్తున్న వృద్ధులు

ABN , First Publish Date - 2020-10-28T17:03:08+05:30 IST

బీహార్‌లో ఈరోజు అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ జరుగుతోంది.

ఉత్సాహంగా ఓటు వేస్తున్న వృద్ధులు

పట్నా: బీహార్‌లో ఈరోజు అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ జరుగుతోంది. ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. వృద్ధులు సైతం ఓటు వేసేందుకు ఎవరో ఒకరి సహాయం తీసుకుంటూ పోలింగ్ బూత్‌లకు చేరుకుని, ఓటు వేస్తున్నారు. ఆరాకు చెందిన సాబిర్ అలీ(83) తన కుమారుని సాయంతో పోలింగ్ బూత్ నంబర్ 156కు వచ్చి ఓటు వేశారు. 


80 ఏళ్లు పైబడిన వృద్ధులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించినప్పటికీ, సాబిర్ అలీకి ఆ అవకాశం దక్కలేదు. దీంతో పోలింగ్ బూత్‌కు వచ్చి ఓటు వేశారు. మొకామాలోని మకెరాకు చెందిన 80 ఏళ్ల కామేశ్వర్ నడవలేని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, ట్రై సైకిల్ మీద వచ్చి, మనుమని సహాయంతో ఓటు హక్కు వినియోగించుకున్నారు. యువతకు ఉపాధి, వృద్ధులకు పింఛన్లు ఇచ్చే ప్రభుత్వానికే మద్దతు ఇస్తామని తెలిపారు. భాగల్‌పూర్‌లో 80 ఏళ్ల యమునాశర్మ పోలింగ్ కేంద్రానికి వచ్చి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీహార్ అభివృద్ధిని కాంక్షిస్తూ తాను ఓటు వేశానని తెలిపారు. 


Updated Date - 2020-10-28T17:03:08+05:30 IST