డొనాల్డ్‌ ట్రంప్‌ పేరిట బైడెన్‌ వ్యంగ్య వెబ్‌సైట్‌!

ABN , First Publish Date - 2020-10-28T07:56:31+05:30 IST

అధ్యక్ష ఎన్నికల్లో తన ప్రధాన ప్రత్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ పేరిట డెమొక్రాట్‌ అభ్యర్థి జో బైడెన్‌ ఏకంగా ఓ వెబ్‌సైట్‌ను ప్రారంభించేశారు...

డొనాల్డ్‌ ట్రంప్‌ పేరిట బైడెన్‌ వ్యంగ్య వెబ్‌సైట్‌!

వాషింగ్టన్‌, అక్టోబరు 27: అధ్యక్ష ఎన్నికల్లో తన ప్రధాన ప్రత్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ పేరిట డెమొక్రాట్‌ అభ్యర్థి జో బైడెన్‌ ఏకంగా ఓ వెబ్‌సైట్‌ను ప్రారంభించేశారు. కొవిడ్‌ ఉధృతిని అరికట్టడంలో ట్రంప్‌ ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రధాన ప్రచారాస్త్రంగా చేసుకున్న బైడెన్‌- ఆ విషయాన్ని హైలైట్‌ చేయడానికి సోషల్‌ మీడియాను ఎన్నుకున్నారు. ట్రంప్‌కొవిడ్‌ప్లాన్‌ డాట్‌ కామ్‌ పేరిట రూపొందించిన ఈ వెబ్‌లో అన్నీ  వ్యంగ్యంగానే కనిపిస్తాయి. ఎనిమిది నెలల కాలంలో ట్రంప్‌ ఈ మహమ్మారిని ఓడించడానికి ఏఏ ప్రఽణాళికలు రూపొందించారో తెలుసా అని చెబుతూ బైడన్‌ దీని లింక్‌ను ప్రజలకు చేరవేశారు. దీన్ని క్లిక్‌ చేస్తే నాట్‌ ఫౌండ్‌ అనే  పెద్ద పెద్ద అక్షరాలు కనిపిస్తాయి. అంటే కొవిడ్‌ కట్టడి ప్రణాళికలు అసలు ట్రంప్‌ వద్ద లేనేలేవని బైడెన్‌ దీని ద్వారా సంకేతమిచ్చారు. దాని కింద లెర్న్‌ మోర్‌ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. దాన్ని క్లిక్‌ చేస్తే కరోనాపై ట్రంప్‌ వేసిన పిల్లిమొగ్గలు, తప్పుదోవ పట్టించే ప్రకటనలు, ట్వీట్లు కనిపిస్తాయి. అమెరికా అంతటా ఇది బాగా పాపులర్‌ అవుతోంది. 


Updated Date - 2020-10-28T07:56:31+05:30 IST