అడ్వాంటేజ్‌ బిడెన్‌!

ABN , First Publish Date - 2020-09-21T08:03:11+05:30 IST

సరిగ్గా మరో 40 రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. అమెరికా చరిత్రలో ఇవి 59వ అధ్యక్ష ఎన్నికలు. కొవిడ్‌ పడగ విప్పి బలంగా కాటేసిన పరిస్థితుల్లో అమెరికన్లు తమ అధ్యక్షుణ్ని నవంబరు 3న ఎన్నుకోబోతున్నారు. రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (74), డెమొక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి, మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్‌ (78) గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నారు...

అడ్వాంటేజ్‌ బిడెన్‌!

 • అమెరికా ఒపీనియన్‌ పోల్స్‌లో ముందంజ
 • కొవిడ్‌ వ్యాక్సిన్‌పై ట్రంప్‌ ఆశలు.. యువ ఓటర్లపై ట్రంప్‌ ముద్ర.. 
 • అభివృద్ధి ఎజెండాను నమ్ముకున్న జో బిడెన్
 • బిడెన్‌ వైపే భారతీయ ఓటరు!


సరిగ్గా మరో 40 రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి.  అమెరికా చరిత్రలో ఇవి 59వ అధ్యక్ష ఎన్నికలు. కొవిడ్‌ పడగ విప్పి బలంగా కాటేసిన పరిస్థితుల్లో అమెరికన్లు తమ అధ్యక్షుణ్ని నవంబరు 3న ఎన్నుకోబోతున్నారు. రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (74), డెమొక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి, మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్‌ (78) గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ట్రంప్‌ తన ఉపాధ్యక్ష అభ్యర్థిగా ప్రస్తుత వైస్‌ ప్రెసిడెంట్‌ మైక్‌ పెన్స్‌నే ఎంపిక చేసుకోగా- బిడెన్‌ తొలిసారిగా ఓ భారతీయ అమెరికన్‌ కమలా హారి్‌సను ఎంపిక చేశారు. బరిలో లిబర్టేరియన్‌ పార్టీ తరఫున జో జార్గెన్‌సన్‌, గ్రీన్‌పార్టీ తరఫున హౌవీ హాకిన్స్‌ ఉన్నా వారి పోటీ నామమాత్రమే! అభిశంసన మచ్చ పడి మళ్లీ బరిలో దిగిన అధ్యక్షుల్లో ట్రంప్‌ రెండోవారు.  రెండోసారీ తన ఎన్నిక ఖాయమని ట్రంప్‌ విశ్వసిస్తున్నారు. అయితే ఇప్పటిదాకా వచ్చిన అన్ని ఒపీనియన్‌ పోల్స్‌లోనూ బిడెన్‌కే ఆధిక్యం కనబడింది. ఆసక్తికరమైన ఈ రణాంగం... అమెరికానే గాక, ప్రపంచ రాజకీయాల్ని కూడా శాసించనుంది.


వాషింగ్టన్‌, సెప్టెంబరు 19: అమెరికాలోని 4 రాష్ట్రాల్లో ముందస్తు ఓటింగ్‌ శనివారమే ప్రారంభమైంది. వర్జీనియా, మినెసోటా, సౌత్‌ డకోటా, వోమింగ్‌ల్లో ఓటర్లు ఎన్నికల కేం ద్రాల ముందు బారులు తీరారు. అమెరికన్లు అధ్యక్షుణ్ణి నేరు గా ఎన్నుకోరు. 538 మందితో కూడిన ఎలక్టోరల్‌ కాలేజీని ఎన్నుకుంటారు.  ప్రతీ రాష్ట్రానికి ఓటర్ల సంఖ్య, కాంగ్రె్‌సలో సభ్యుల సంఖ్యను బట్టి ఎలక్టర్స్‌ను కేటాయిస్తారు. అతిపెద్ద రాష్ట్రమైన కాలిఫోర్నియా నుంచి 55 మంది ఎలక్టర్స్‌ ఉంటారు. 538మంది ఎలక్టర్స్‌(ప్రతినిధులు)ను నవంబరు 3న ఎన్నుకుంటారు. ఈ ఎలక్టర్స్‌ అం తా డిసెంబరు తొలి వారంలో సమావేశమై అధ్యక్షుణ్ని ఎన్నుకుంటారు. అధ్యక్షుడు కావడానికి ఎలక్టోరల్‌ కాలేజీలో సగం మంది (270) మద్దతు అవసరం. 33 రాష్ట్రాల్లో రిపబ్లికన్‌ లేదా డెమొక్రటిక్‌ పార్టీ సదస్సుల్లో ఎలక్టర్ల ఎంపిక జరుగుతుంది. 10 రాష్ట్రాల్లో ఆయా పార్టీల రాష్ట్ర కమిటీలు ఎంపిక చేస్తాయి. 5 రాష్ట్రాల్లో గవర్నర్లు నామినేట్‌ చేస్తారు. మిగిలిన చోట్ల రాష్ట్ర పార్టీ సదస్సుల్లో నామినేషన్‌ చేస్తారు. నెబ్రా స్కా, మైన్‌ రాష్ట్రాల్లో మినహా అన్ని రాష్ట్రా ల్లో అత్యధిక ఓట్లు సాధించిన వ్యక్తి తాలూకు పార్టీకే ఆ రాష్ట్రంలోని మిగిలిన అందరు ఎలక్టర్స్‌ చెందుతారు. మెజారిటీ ఎలక్టర్స్‌ పార్టీ విధేయతతోనే ఉండ టంతో తదుపరి అధ్యక్షుడి ఎన్నిక సాఫీగానే సాగుతుంది.


ఓట్లు ఎన్నొచ్చినా సీట్లే ముఖ్యం

అమెరికన్‌ ఎన్నికల వ్యవస్థ చిత్రంగా ఉంటుంది. పాపులర్‌ ఓట్లు ఎక్కువ పడినా ఎలక్టోర్‌ కాలేజీ ఓట్లే విజేతను నిర్ణయిస్తాయి. మేజిక్‌ ఫిగర్‌ 270 సాధించలేకపోతే ఎవరూ అధ్యక్షుడు కాలేరు. నాలుగేళ్ల కిందట జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్‌ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు రిపబ్లికన్‌ ప్రత్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ కంటే 3లక్షలకు పైగా పాపులర్‌ ఓట్లు లభించాయి. ట్రంప్‌కు ఎలక్టోరల్‌ కాలేజీ ఓట్లు 304 వచ్చాయి. హిల్లరీకి 227 మాత్రమే వచ్చాయి. దీంతో ఆమె ఓడిపోయారు. 2000లోనూ ఇదే జరిగింది. డెమాక్రాట్‌ అభ్యర్థి అల్‌గోరెకు పాపులర్‌ ఓట్లు రిపబ్లికన్‌ అభ్యర్థి జార్జిబుష్‌ కంటే 2శాతం ఎక్కువగా వచ్చాయి. కానీ బుష్‌ 271 ఎలక్టోరల్‌ కాలేజీ ఓట్లతో అధ్యక్షుడయ్యారు. అల్‌గోరెకు 266 ఓట్లు వచ్చాయి.. ఓడిపోయారు.


ఎవరూ 270 ఓట్లు సాధించకుంటే!

ఏ అభ్యర్థీ 270 ఎలక్టోరల్‌ ఓట్లు సాధించకుంటే అధ్యక్షుణ్ని ప్రతినిధుల సభ(హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌) ఎంపిక చేస్తుంది. ప్రతీ రాష్ట్రానికి ఒక్కో ఓటుంటుంది. అం టే ఈ సభలో మెజారిటీ ఉన్న పక్షం ఎన్నుకునే వ్యక్తే అధ్యక్షుడవుతారు. ఉపాధ్యక్షుణ్ని మాత్రం సెనెట్‌ ఎన్నుకుంటుంది. అక్కడున్న 100 మంది సభ్యుల్లో ప్రతీ ఒక్కరికీ ఒక్కో ఓటుంటుంది. వారు స్వతంత్రంగా ఎవరికైనా ఓటు చేయవచ్చు. లేదా పార్టీ విధానానికి అనుగుణంగా ఓటెయ్యవచ్చు. ఏ పార్టీకీ అనుకూలంగా ఉండకుండా ఓటింగ్‌ సరళిని మార్చే ప్రభావ రాష్ట్రాలు ఫ్లోరిడా, కొలరాడో, లోవా, మిచిగన్‌, మినెసోటా, నెవడా, న్యూహాం్‌పషైర్‌, నార్త్‌ కరోలినా, ఒహాయో, పెన్సిల్వేనియా, వర్జీనియా, విస్కాన్‌సన్‌. బిడెన్‌: అనుకూలతలు

 1. ఒబామా హయాంలో ఉపాధ్యక్షుడిగా చేసిన అనుభవం.. 1972 నుంచీ 6 సార్లు సెనెట్‌కు ఎన్నిక
 2. ఒబామా హయాంలో తెచ్చిన ఆరోగ్యపథకం ఒబామా కేర్‌ను పరిపుష్టం చేసిన ఘనత
 3. హింసకు, మహిళలపై అకృత్యాలకు వ్యతిరేకంగా కీలక చట్టాలు తేవడంలో నాడు కీలక పాత్ర
 4. అనేక కమిటీల్లో సభ్యుడు. విదేశీ నేతలతో సంబంధాలు. 
 5. వాతావరణ మార్పులకు సంబంధించిన చర్చల్లో క్రియాశీల పాత్ర

ప్రతికూలతలు

 1. 78 ఏళ్ల వయసు.. ఒకవేళ ఎన్నికైతే అమెరికా చరిత్రలోనే అతి పెద్ద వయస్కుడైన అధ్యక్షుడిగా పేరు
 2. కుమారుడు హంటర్‌ బిడెన్‌ ఆర్థిక కార్యకలాపాల్లో పాత్ర. ఉక్రెయిన్‌ ఉదంతంలో నాటి ఉపాధ్యక్ష హోదాలో కుమారుడికి సాయపడినట్లు ఆరోపణలు
 3. ట్రంప్‌తో పోలిస్తే సాత్వికుడు.. అభివృద్ధి ఎజెండానే ఎక్కువ నమ్మినవాడు
 4. ట్రంప్‌తో పోలిస్తే ఆర్థికరంగం, ఉపాధి అవకాశాల పెంపుదలలో మెరుగ్గా వ్యవహరించలేరన్న అభిప్రాయాలు


ట్రంప్‌: అనుకూలతలు

 1. జాతీయవాద నినాదం.. అమెరికా ఫస్ట్‌ నినాదంతో ఆదరణ. అమెరికన్లకు ఉద్యోగాల్లో ప్రాధాన్యం.
 2. ఆర్థిక రంగాన్ని పరిపుష్టం చేసిన నేతగా పేరు. కొవిడ్‌ రాకమునుపు ఆర్థిక స్థితి బలంగా ఉంది.
 3. విదేశాల్లో అమెరికా చేస్తున్న ఖర్చును తగ్గించడం. సిరియా, అఫ్గానిస్థాన్‌లలో సేనల ఉపసంహరణ, నాటోకిస్తున్న సొమ్ములో కోత, డబ్ల్యుహెచ్‌వో లాం టి సంస్థలకు ఆర్థిక సాయం నిలిపివేత వంటివి..
 4. ఐసిస్‌ నేత అబూ బకర్‌ అల్‌ బాగ్దాదీ, ఇరాన్‌ సైనిక నియంత ఖాసిం సులేమానీ, అల్‌ ఖైదా నేత ఒసామా బిన్‌ లాడెన్‌ కుమారుడు హమ్జా లాడెన్‌ మొదలైన వారిని హతమార్చడంలో కీలక భూమిక
 5. ఇరాన్‌పై ఆంక్షలు విధించినా మిగిలిన ఇస్లామిక్‌ దేశాలతో సత్సంబంధాలు
 6. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉండటం వల్ల వైట్‌హౌస్‌ స హా కొన్ని యంత్రాంగాలు సహకరిస్తాయి.  


ప్రతికూలతలు

 1. కొవిడ్‌ను సమర్థంగా ఎదుర్కొనడంలో వైఫల్యం.... వివిధ రాష్ట్రాలతో విరోధం
 2. ఉక్రెయిన్‌ విషయంలో అభిశంసన ఎదుర్కోవడం. దీని నుంచి తప్పించుకున్నా మచ్చ యథాతథం.
 3. వ్యక్తిగత జీవనంలో లోపాలు... అనేకమంది మహిళలతో సంబంధాలున్నట్లు ఆరోపణలు
 4. ఆలోచించకుండా ట్వీట్లు చేసి ఇబ్బందుల్లో పడడం.భారతీయ ఓటరు ఎటు..?

అమెరికాలో 12 లక్షల భారతీయ ఓటర్లు కీలకం. బిడెన్‌ భారతీయ ఓటర్ల మనసు గెలుచుకునేందుకే ఉపాధ్యక్ష అభ్యర్థిగా కమలా హారి్‌సను ఎంపిక చేసుకున్నారని అంటున్నారు. అయితే మోదీతో ట్రంప్‌ బలమైన బంధాన్ని ఏర్పరుచుకున్నారు. అయినా భారతీయుల మద్దతు ట్రంప్‌కు 30శాతం, బిడెన్‌కు 70శాతం ఉందని ‘ఏషియన్‌ అమెరికన్స్‌ అండ్‌ పాసిఫిక్‌ ఐలండర్స్‌ (ఏఐపీఐ) అనే సంస్థ తేల్చింది.


ఒపీనియన్‌ పోల్స్‌ చెప్పేదేంటి?

ఎన్నికల సమయం దగ్గరవుతున్న కొద్దీ జో బిడెన్‌ ఆధిక్యతను పెంచుకుంటున్నట్లు ముఖ్యమైన అన్ని ఒపీనియన్‌ పోల్స్‌ చెబుతున్నాయి. అన్ని పోల్స్‌ సగటు చూస్తే ఆయన ట్రంప్‌ కంటే 6 శాతం అధికంగా ప్రజాదరణ సాధించినట్లు వెల్లడవుతోంది. ఒహాయో, లోవా లాంటి రెండు మూడు రాష్ట్రాల్లో తప్పితే మిగిలిన తొమ్మిది ప్రభావ రాష్ట్రాల్లోనూ బిడెన్‌దే పైచేయిగా ఉందని ఈపోల్స్‌ పేర్కొంటున్నాయి.


యువ ఓటర్లే కీలకం

ఈ ఎన్నికల్లో యువ ఓటర్లు అత్యంత కీలకం కానున్నారు. సర్వేల ప్రకారం 18-45 ఏళ్ల లోపు ఉన్న ఓటర్ల సంఖ్య 40 శాతం పైనే ఉంది. అదే విధంగా ‘జనరేషన్‌ జెడ్‌’ గా పిలుస్తున్న మిలీనియల్స్‌, 1996 తర్వాత పుట్టినవారు మరో 12ు ఉన్నారు. వీరంతా ట్రంప్‌ హోరెత్తిస్తున్న జాతీయవాద, అమెరికా ఫస్ట్‌ నినాదాలకు ఆకర్షితులవుతున్నారు. 50 ఏళ్లు పైబడ్డ ఓటర్లలో ఎక్కువ మంది డెమొక్రటిక్‌ పార్టీని సమర్థిస్తున్నారు. ఈ దృష్ట్యా - బిడెన్‌కు ఒపీనియన్‌ పోల్స్‌ ఆధిక్యత కట్టబెట్టినా అంతిమ విజేత ట్రంపే అవుతారని సర్వేలు వెల్లడిస్తున్నాయి. 


కరోనా ప్రభావం

ఈ ఎన్నికల్లో కరోనా వైరస్‌ ప్రభావం, దానిని ఎదుర్కొనడంలో ట్రంప్‌ ప్రభుత్వ వైఫల్యాలు ప్రధానప్రచారాంశంగా మారింది. ఇప్పటిదాకా 2.03 లక్షల మంది అమెరికన్లు దీని బారిన పడి ప్రాణాలొదిలారు. మరొక 25.36 లక్షల మంది చావుబతుకుల మధ్య ఉన్నారు. ఈ జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనడంలో ట్రంప్‌ అన్ని రాష్ట్రాలనూ కలుపుకొని వెళ్లలేక, వారితో విభేదాలు తెచ్చుకుని అభాసుపాలయ్యారన్న విమర్శలున్నాయి. కొవిడ్‌ ప్రభావం వల్ల అనేక రాష్ట్రాల్లో ఓటర్లు ‘మెయిల్‌ ద్వారా ఓటింగ్‌’కు మొగ్గుచూపుతున్నారు. అయితే ఈ పద్ధతిలో మోసానికి అవకాశముందని ట్రంప్‌ ఆక్రోశిస్తున్నారు.


ప్రచారాంశాలు: 

 1. కొవిడ్‌ ఎదుర్కొనడం, వ్యాక్సిన్‌పై ట్రంప్‌ పిల్లిమొగ్గలు
 2. కొవిడ్‌ వల్ల రోడ్డున పడ్డ ఉద్యోగులు... ఉపాధి అవకాశాలు మృగ్యం
 3. కాలిఫోర్నియా కార్చిచ్చు- వాతావరణ మార్పుల వ్యవహారం
 4. గన్స్‌ కలిగి ఉండడానికి హక్కులు- లైసెన్సుల జారీ
 5. కాలేజీ, వర్సిటీ విద్యార్థులకు ఉచిత  విద్యా ఖర్చు- లోన్లు
 6. వలస విధానాలు.... మెక్సికో గోడ 
 7. అబార్షన్‌ హక్కులు
 8. వాణిజ్య విధానాలు- ఆంక్షలు
 9. ఆరోగ్యం- ఇతర హెల్త్‌ కేర్‌ విధానాలు
 10. ఆర్థిక ఒడిదుడుకులుఎన్నిక తేదీ: నవంబరు 3

అధ్యక్ష పదవీ ప్రమాణం: జనవరి 20


మొత్తం రాష్ట్రాలు 50

ఓటర్లు 170 మిలియన్లు


శ్వేత జాతీయులు 66,7 శాతం

హిస్పానిక్స్‌ 13.2 శాతం


ఆఫ్రికన్‌ అమెరికన్లు 12.5 శాతం

ఆసియా దేశాల వారు 4.7 శాతం


Updated Date - 2020-09-21T08:03:11+05:30 IST