కొత్తపార్లమెంట్‌ భవనానికి 10న భూమిపూజ

ABN , First Publish Date - 2020-12-06T06:57:34+05:30 IST

పార్లమెంట్‌ కొత్తభవనానికి ప్రధాని మోదీ ఈ నెల 10న భూమిపూజ చేస్తారు. రూ.971 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించే ఈ భవనం 2022 నాటికి పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు.

కొత్తపార్లమెంట్‌ భవనానికి 10న భూమిపూజ

న్యూఢిల్లీ, డిసెంబరు 5: పార్లమెంట్‌ కొత్తభవనానికి ప్రధాని మోదీ ఈ నెల 10న భూమిపూజ చేస్తారు. రూ.971 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించే ఈ భవనం 2022 నాటికి పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. కొత్త భవ నం భూకంపాలను తట్టుకునేలా ఉంటుందని లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా తెలిపారు. దీంట్లో 1,224 మంది ఎంపీలు కూచునేందుకు వీలుంటుంది. 

Read more