కరోనా పీడ వదిలించుకున్న ఒడిశా రాజధాని

ABN , First Publish Date - 2020-05-19T01:25:08+05:30 IST

ఒడిశా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ కరోనా పీడను వదిలించుకుంది

కరోనా పీడ వదిలించుకున్న ఒడిశా రాజధాని

భువనేశ్వర్: ఒడిశా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ కరోనా పీడను వదిలించుకుంది. కొంత కాలంగా కరోనా కేసులేవీ నమోదు కాకపోగా.. చికిత్స పొందుతున్న రోగులందరూ పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అవడంతో భువనేశ్వర్ కరోనా రహిత ప్రాంతంగా అవతరిచింది. మార్చి 15న రాష్ట్రంలోని తొలి కరోనా కేసు రాజధానిలో నమోదవగా.. తొలి కరోనా మరణం ఏప్రిల్ 6న సంభవించింది. రాష్ట్రంలో మొత్తం 57 కేసులు వెలుగు చూడగా.. వీటిలో 50 రాజధానికి చెందినవే. వీరిలో 48 మంది కోలుకోగా.. ఇద్దరు మృతి చెందారు. నగరంలో మిగిలిన ముగ్గురు కరోనా పేషెంట్లు కూడా కోలుకుని తమ తమ ఇళ్లకు వెళ్లడంతో భువనేశ్వర్ కరోనా రహిత ప్రాంతంగా అవతరించింది. రాజధానితో పాటూ జగత్‌సింగ్ పూర్ జిల్లాకూడా కరోనాను పూర్తిగా తరిమికొట్టేసింది. 


Updated Date - 2020-05-19T01:25:08+05:30 IST