12 మంది విదేశీ జమాత్ సభ్యులకు కోర్టు జరిమానా

ABN , First Publish Date - 2020-08-11T12:55:31+05:30 IST

మార్చి నెలలో కొవిడ్-19 ఆంక్షలను ఉల్లంఘించి తబ్లీగ్ జమాత్ సమావేశాల్లో పాల్గొన్న కిర్గిస్థాన్, ఇండోనేషియా దేశీయులకు కోర్టు జరిమానా విధించింది....

12 మంది విదేశీ జమాత్ సభ్యులకు కోర్టు జరిమానా

భోపాల్ (మధ్యప్రదేశ్): మార్చి నెలలో కొవిడ్-19 ఆంక్షలను ఉల్లంఘించి తబ్లీగ్ జమాత్ సమావేశాల్లో పాల్గొన్న కిర్గిస్థాన్, ఇండోనేషియా దేశీయులకు కోర్టు జరిమానా విధించింది. 12 మంది కిర్గిస్థాన్ దేశానికి చెందిన పౌరులు ఢిల్లీలో జమాత్ సమావేశాల్లో పాల్గొని నిబంధనలను ఉల్లంఘించారని తేలడంతో వారికి ఒక్కొక్కరికి రూ.6వేల జరిమానాను భోపాల్ కోర్టు విధించింది. మరో 12 మంది ఇండోనేషియా వాసులకు రూ.7వేలు చొప్పున జరిమానా విధిస్తూ మరో కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పలు దేశాల నుంచి ఢిల్లీ వచ్చిన జమాత్ సభ్యులు వీసా నిబంధనలు ఉల్లంఘించారని పోలీసుల దర్యాప్తులో తేలింది. వీసా నిబంధనలను ఉల్లంఘించిన విదేశీ జమాత్ సభ్యుల పాస్ పోర్టులను సీజ్ చేయాలని, వీసాలు రద్దు చేయాలని కోర్టును అభ్యర్థించారు. 

Updated Date - 2020-08-11T12:55:31+05:30 IST