ఎన్‌సీబీ దాడులపై కమెడియన్ భారతి సింగ్‌ రియాక్షన్..

ABN , First Publish Date - 2020-11-22T01:43:08+05:30 IST

బాలీవుడ్ డ్రగ్స్ కేసులో బుల్లితెర కమెడియన్ భారతి సింగ్, ఆమె భర్త లింబచియాను ..

ఎన్‌సీబీ దాడులపై కమెడియన్ భారతి సింగ్‌ రియాక్షన్..

ముంబై: బాలీవుడ్ డ్రగ్స్ కేసులో బుల్లితెర కమెడియన్ భారతి సింగ్, ఆమె భర్త లింబచియాను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు శనివారంనాడు నిర్బంధంలోకి తీసుకున్నారు. అంథేరిలోని భారతి సింగ్ నివాసంపై ఎన్‌సీబీబీ అధికారులు ఉదయం ఆకస్మిక సోదాలు నిర్వహించారు. స్వల్ప పరిమాణంలో మాదకద్రవ్యాలను కనుగొన్నారు. దీంతో ఆ ఇరువురుని అదుపులోనికి తీసుకుని దీనిపై మరింత లోతుగా ప్రశ్నించేందుకు ఎన్‌సీబీ కార్యాలయానికి తీసుకెళ్లారు.


ఎన్‌సీబీ కార్యాలయంలోకి వెళ్లేందుకు కారు దిగిన భారతి సింగ్‌ను విలేఖరులు చుట్టుముట్టడంతో, మామాలు ప్రక్రియలో ప్రశ్నించేందుకే తమను కార్యాలయానికి రమ్మన్నారని, ఇదేమంత పెద్ద విషయం కాదని చెప్పారు. ఈ కేసులో తొలుత రియాచక్రవర్తి అరెస్టు కావడం, నటుడు అర్జున్ రాంపాల్‌ను ఎన్‌సీబీ ప్రశ్నించడం వంటివి చోటుచేసుకున్నాయి. అనంతరం భారతి, హర్ష్ పేర్లు వెలుగుచూశాయి. మాదకద్రవ్యాల వ్యాపారి ఒకరిని ప్రశ్నించినప్పుడు భారతిసింగ్, హర్ష్ పేర్లు బయటకు రావడంతో రంగంలోకి దిగినట్టు ఎన్‌సీబీ వర్గాలు తెలిపాయి. జూన్ 14న బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ ఆత్మహత్య చేసుకోవడం సంచలనమైంది. రియాచక్రవర్తి, తదితరులు ఈ ఆత్మహత్యకు ప్రేరేపించినట్టు రాజ్‌పుత్ కుటుంబసభ్యులు ఆరోపించడంతో దర్యాప్తు మొదలైంది. డ్రగ్స్ కోణం నుంచి చురుకుగా దర్యాప్తు సాగుతోంది.

Read more