సంతోష్‌బాబుకు ‘భారత టైగర్‌’ బిరుదు

ABN , First Publish Date - 2020-06-23T08:15:21+05:30 IST

అమరవీరుడు సంతో్‌ష బాబుకు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ‘భారత టైగర్‌’ బిరుదును ప్రదానం చేయనున్నట్టు ఆ మహాసభ గ్లోబల్‌ అధ్యక్షుడు తంగుటూరి రామకృష్ణ తెలిపారు...

సంతోష్‌బాబుకు ‘భారత టైగర్‌’ బిరుదు

  • ప్రపంచ ఆర్య మహాసభ నిర్ణయం


చెన్నై, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి) : అమరవీరుడు సంతో్‌ష బాబుకు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ‘భారత టైగర్‌’ బిరుదును ప్రదానం చేయనున్నట్టు ఆ మహాసభ గ్లోబల్‌ అధ్యక్షుడు తంగుటూరి రామకృష్ణ తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన జారీ చేస్తూ చైనా సైనికుల దాడిలో వీరమరణం పొందిన కర్నల్‌ సంతో్‌షబాబు వైశ్యుడైనందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆర్యవైశ్య కులస్థులంతా గర్విస్తున్నారని, ప్రస్తుతం ఆ భారతవీరుడిని కులమతాలకు అతీతంగా చూస్తున్నామని తెలిపారు. లాక్‌డౌన్‌ పూర్తిగా తొలగిన తర్వాత తెలంగాణలోని ఓ ముఖ్య ప్రాంతంలో భారీ సభను ఏర్పాటు చేసి ఆ  ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆహ్వానించి, స్వర్ణపతకం రూపంలో ‘భారత టైగర్‌’ అనే బిరుదును సంతో్‌షబాబు కుటుంబీకులకు ప్రదానం చేసి  భారత ప్రజల తరఫున వారికి కృతజ్ఞతలు తెలుపుకోనున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం అనుమతిస్తే ఆ రాష్ట్రంలో ఏదైనా కీలక కూడలిలో సంతో్‌షబాబు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.


Read more