ఏస్‌డీపీఐపై నిషేధాన్ని కోరనున్న యడియూరప్ప

ABN , First Publish Date - 2020-08-20T21:21:55+05:30 IST

ఈనెల 11న బెంగళూరులో జరిగిన హింసాకాండలో కీలక పాత్ర పోషించినట్టు భావిస్తున్న సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా..

ఏస్‌డీపీఐపై నిషేధాన్ని కోరనున్న యడియూరప్ప

బెంగళూరు: ఈనెల 11న బెంగళూరులో జరిగిన హింసాకాండలో కీలక పాత్ర పోషించినట్టు భావిస్తున్న సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్‌డీపీఐ)పై నిషేధం విధించే అంశాన్ని ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప కేంద్రంతో చర్చించనున్నారు. కర్ణాటక హోం మంత్రి బసవరాజ్ బొమ్మై బుధవారంనాడు మీడియాకు ఈ విషయం తెలిపారు.


'కేంద్రంతో చర్చించి ఎస్‌డీపీఐపై నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి చెప్పారు. బెంగళూరు హింసపై సకాలంలో చర్య తీసుకున్న హోం శాఖ, పోలీసులను మంత్రివర్గం అభినందించింది' అని బొమ్మై తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చిన ఓ పోస్టింగ్‌తో ఈనెల 11న బెంగళూరులోని పలు ప్రాంతాల్లో హింస చెలరేగింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా, సుమారు 60 మంది పోలీసు సిబ్బంది గాయపడ్డారు. ఈ హింసాకాండకు సంబంధించి మొత్తం 340 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఎస్‌డీపీఐకి చెందిన పలువురు ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు.

Updated Date - 2020-08-20T21:21:55+05:30 IST