7 నుంచి మెట్రో సర్వీసులు

ABN , First Publish Date - 2020-09-07T02:18:44+05:30 IST

7 నుంచి మెట్రో సర్వీసులు

7 నుంచి మెట్రో సర్వీసులు

బెంగళూరు: లాక్ డౌన్ నుంచి కేంద్ర ప్రభుత్వం మరికొన్ని సడలింపులు ఇవ్వడంతో మెట్రో రైళ్ల సర్వీసులను తిరిగి ప్రారంభించేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. బెంగళూరు మెట్రో సెప్టెంబర్ 7 నుంచి తిరిగి కార్యకలాపాలు ప్రారంభించనుంది. బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ సోమవారం నుంచి దశలవారీగా మెట్రో సేవలను తిరిగి ప్రారంభిస్తామని ప్రకటించింది. సోమవారం నుంచి పర్పుల్ లైన్‌లో మెట్రో సర్వీసులు ప్రారంభం కాగా, గ్రీన్ లైన్‌లోని రైళ్లు సెప్టెంబర్ 9 నుంచి నడుస్తాయి. పర్పుల్ లైన్‌లో, రైళ్లు గరిష్ట సమయాలలో మాత్రమే సెప్టెంబర్ 10 వరకు 6 గంటలు నడుస్తాయని,  ఉదయం మూడు గంటలు, ఉదయం 8 నుంచి 11 వరకు, సాయంత్రం 4.30 నుంచి 7.30 వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయి. సెప్టెంబర్ 11 నుంచి రైళ్లు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు రెండు లైన్లలో నడుస్తాయి. ప్రతి రైలులో అనుమతించే ప్రయాణికుల సంఖ్య సామాజిక దూర ప్రమాణాలను నిర్ధారించడానికి 400 మంది ప్రయాణికులకు పరిమితం చేయబడిందని బీఎంఆర్సీఎల్ అధికారి ఒకరు తెలిపారు.

Updated Date - 2020-09-07T02:18:44+05:30 IST