అసిస్టెంట్‌కు కరోనా... క్వారంటైన్‌లో బెంగళూరు మేయర్..!

ABN , First Publish Date - 2020-07-08T22:14:20+05:30 IST

తన అసిస్టెంట్‌కు కరోనా సోకిందని తెలియడంతో బెంగళూరు మేయర్ ఎమ్ గౌతమ్ కుమార్ క్వారంటైన్‌ విధించుకున్నారు.

అసిస్టెంట్‌కు కరోనా... క్వారంటైన్‌లో బెంగళూరు మేయర్..!

బెంగళూరు: తన అసిస్టెంట్‌కు కరోనా సోకిందని తెలియడంతో బెంగళూరు మేయర్ ఎమ్ గౌతమ్ కుమార్ తనకు తాను క్వారంటైన్‌ విధించుకున్నారు. ఆయన కార్యాలయ సిబ్బంది కూడా క్వారంటైన్‌లోకి వెళ్లారు. మేయర్ కార్యాలయాన్ని అధికారులు సీల్ చేశారు. అక్కడ పూర్తి శానిటైజేషన్ నిర్వహించిన తరువాతే తిరిగి కార్యాలయం తెరుచుకుంటుందని వారు తెలిపారు. ఇక మేయర్ అసిస్టెంట్‌కు కరోనా ఎలా సోకిందనే దానిపై అధికారులు దృష్టి సారించారు. ఇటీవల ఆయన ఓ కాంట్రాక్టర్‌తో సమావేశంలో పాల్గొన్నారని, ఆ తరువాతే ఆయనకు కరోనా సోకి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.  

Updated Date - 2020-07-08T22:14:20+05:30 IST