ఎమ్మెల్యే ఇంటి ముందు అల్లర్లు... పోలీసుల కాల్పుల్లో ఇద్దరు మృతి!
ABN , First Publish Date - 2020-08-12T10:52:22+05:30 IST
కర్ణాటక రాజధాని బెంగళూరులోని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ మూర్తి నివాసంపై అల్లరి మూక దాడికిపాల్పడింది. వీరు పోలీసులపై కూడా రాళ్లు రువ్వారు. వాహనాన్ని తగులబెట్టారు. ఈ నేపధ్యంలో...

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులోని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ మూర్తి నివాసంపై అల్లరి మూక దాడికిపాల్పడింది. వీరు పోలీసులపై కూడా రాళ్లు రువ్వారు. వాహనాన్ని తగులబెట్టారు. ఈ నేపధ్యంలో పరిస్థితులను అదుపు చేసేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ఎమ్మెల్యే శ్రీనివాస్ మూర్తి నివాసంతో పాటు బెంగళూరు తూర్పులోని కెజె హాలీ పోలీస్ స్టేషన్‌పై కూడా ఈ అల్లరిమూక దాడి చేసింది. ఎమ్మెల్యే మేనల్లుడు సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్టును వ్యతిరేకిస్తూ, వీరు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలం వద్దకు చేరుకున్నారు. ఆందోళనలను అదుపు చేసేందుకు పోలీసులు జరిపిన కాల్పల్లో ఇద్దరు మృతి చెందారు. కాగా ఈ విషయంపై దర్యాప్తు చేయాలని కర్ణాటక హోంమంత్రి బసవరాజ్ బొమ్మయి ఆదేశాలు జారీ చేశారు. దాడికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.