బెంగాల్‌లో విజృంభిస్తున్న కరోనా.. ఈ రోజు 1200 దాకా..

ABN , First Publish Date - 2020-07-11T01:39:00+05:30 IST

బెంగాల్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రెండు రోజు లనుంచి ఏకంగా 1000కి పైగా కేసులు రాష్ట్రంలో...

బెంగాల్‌లో విజృంభిస్తున్న కరోనా.. ఈ రోజు 1200 దాకా..

కలకత్తా: బెంగాల్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రెండు రోజుల నుంచి ఏకంగా 1000కి పైగా కేసులు రాష్ట్రంలో నమోదవ్వడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. తాజా కేసులతో కలుపుకొని మొత్తం కేసుల సంఖ్య కూడా 27వేలు దాటేసింది.  ఈ మేరకు తాజా కేసులకు సంబంధించి రాష్ట్ర ఆరోగ్య శాఖ ఓ నివేదిక విడుదల చేసింది. దాని ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1,198 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 26 మంది మరణించారు. 522 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా నమోదైన కేసులతో కలుపుకొని రాష్ట్రంలోని మొత్తం కేసుల సంఖ్య 27,109కి చేరింది. వీరిలో 8,881మంది చికిత్స పొందుతుండగా 17,348మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కాగా 880మంది మృత్యువాతపడ్డారు.

Updated Date - 2020-07-11T01:39:00+05:30 IST