బెంగాల్‌లో రికార్డు స్థాయిలో కేసులు.. ఒక్కరోజే 3,900 పైగా..

ABN , First Publish Date - 2020-06-24T02:17:03+05:30 IST

బెంగాల్‌లో కొత్తగా 370 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలోని మొత్తం కేసుల...

బెంగాల్‌లో రికార్డు స్థాయిలో కేసులు.. ఒక్కరోజే 3,900 పైగా..

కలకత్తా: బెంగాల్‌లో కొత్తగా 370 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలోని మొత్తం కేసుల సంఖ్య 14,700 దాటేసింది. ఈ మేరకు ఆరోగ్య శాఖ ఓ నివేదిక విడుదల చేసింది. దాని ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల్లో 370 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదుకాగా.. 11 మంది మరణించారు. 531 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా నమోదైన కేసులతో కలుపుకొని రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 14,728కి చేరింది. వీరిలో 4,930మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా 9,218మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 580మంది ప్రాణాలు కోల్పోయారు.

Read more