బెంగాల్‌ అటవీ మంత్రి అసమ్మతి స్వరం

ABN , First Publish Date - 2020-12-07T07:40:47+05:30 IST

పశ్చిమ బెంగాల్‌లో మరో మంత్రి అసమ్మతి స్వ రం వినిపించారు. మమతాబెనర్జీ సర్కారులో కష్టపడేవారికి ప్రాధాన్యం దక్క డం లేదని, ఏసీ గదుల్లో కూర్చుని ప్రజలను పిచ్చివాళ్లను చేయొచ్చని అనుకునేవాళ్లకే ...

బెంగాల్‌ అటవీ మంత్రి అసమ్మతి స్వరం

  • పరోక్షంగా ఆహ్వానం పలికిన రాష్ట్ర బీజేపీ చీఫ్‌


కోల్‌కతా, డిసెంబరు 6: పశ్చిమ బెంగాల్‌లో మరో మంత్రి అసమ్మతి స్వ రం వినిపించారు. మమతాబెనర్జీ సర్కారులో కష్టపడేవారికి ప్రాధాన్యం దక్క డం లేదని, ఏసీ గదుల్లో కూర్చుని ప్రజలను పిచ్చివాళ్లను చేయొచ్చని అనుకునేవాళ్లకే విలువ ఉంటోందని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి రాజీవ్‌ బెనర్జీ విమర్శించారు. అయితే, సీఎం మమతా బెనర్జీనే అందరికీ పెద్ద దిక్కని, పార్టీ నుంచి వెళ్లిపోవాలనుకుంటే అభ్యంతరం లేదంటూ తృణమూల్‌ ఎంపీ కల్యాణ్‌ బెనర్జీ తీవ్రంగా స్పందించారు. మరోవైపు రాజీవ్‌ బెనర్జీ గౌరవంగా పని చేయాలనుకుంటే టీఎంసీ నుంచి బయటికి రావాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ పార్టీలోకి పరోక్షంగా ఆహ్వానించారు. కాగా, బెంగాల్‌లోని దక్షిణ జిల్లాల్లో పట్టున సువేందు అధికారి మంత్రి పదవికి రాజీనామా చేశారు. 

Updated Date - 2020-12-07T07:40:47+05:30 IST