పాఠశాల డ్రాపౌట్‌ రేటు తగ్గడంలో బెంగాల్‌ ఫస్ట్‌

ABN , First Publish Date - 2020-10-31T07:27:24+05:30 IST

పాఠశాల విద్యార్థుల డ్రాపౌట్‌ రేటు తగ్గడంలో పశ్చిమ బెంగాల్‌ మొదటిస్థానంలో నిలిచింది. యాన్యువల్‌ స్టేట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రిపోర్ట్‌ 2020

పాఠశాల డ్రాపౌట్‌ రేటు తగ్గడంలో బెంగాల్‌ ఫస్ట్‌

తెలంగాణలో డ్రాపౌట్‌ రేటు 14 శాతం... తాజా సర్వేలో వెల్లడి 

కోల్‌కతా, అక్టోబరు 30: పాఠశాల విద్యార్థుల డ్రాపౌట్‌ రేటు తగ్గడంలో పశ్చిమ బెంగాల్‌ మొదటిస్థానంలో నిలిచింది. యాన్యువల్‌ స్టేట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రిపోర్ట్‌ 2020 నివేదిక ప్రకారం.. 2018-20 కాలంలో ఈ రాష్ట్రంలో పాఠశాల డ్రాపౌట్‌ రేటు 3.3 శాతం నుంచి 1.5 శాతానికి తగ్గింది.

జాతీయ స్థాయిలో అయితే 4 శాతం నుంచి 5.5 శాతానికి పెరిగింది. కర్ణాటక, తెలంగాణ, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో డ్రాపౌట్‌ రేటు వరుసగా 11.3 శాతం, 14 శాతం, 14.9 శాతంగా ఉంది. 26 రాష్ట్రాలకు చెందిన 584 జిల్లాల్లోని 16,974 గ్రామాలకు చెందిన 52,227 కుటుంబాలను సర్వే చేసి నివేదిక రూపొందించారు.

Read more